మోదీకి తృటిలో తప్పిన ప్రమాదం!

కాన్పూర్ పర్యటనలో మోదీకి పెను ప్రమాదం తప్పింది. గంగానది మెట్లు ఎక్కుతూ మోదీ జారీ పడ్డారు. అటల్ ఘాట్ వద్ద ఒక అడుగు తప్పి మెట్లపై పడిపోయారు అదృష్టవశాత్తు ఆయనకు గాయాలేం కాలేదు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నమామి గంగే ప్రాజెక్ట్ కింద గంగా నది పరిశుభ్రతను పరిశీలించడానికి ప్రధాని అక్కడికి వెళ్ళారు. గంగానది ప్రక్షాళనపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ‘ నమామి గంగే ‘ పేరిట చేపట్టిన ప్రాజెక్టు పురోగతిమీద శనివారం కాన్పూర్ […]

మోదీకి తృటిలో తప్పిన ప్రమాదం!
Follow us

| Edited By:

Updated on: Dec 14, 2019 | 11:07 PM

కాన్పూర్ పర్యటనలో మోదీకి పెను ప్రమాదం తప్పింది. గంగానది మెట్లు ఎక్కుతూ మోదీ జారీ పడ్డారు. అటల్ ఘాట్ వద్ద ఒక అడుగు తప్పి మెట్లపై పడిపోయారు అదృష్టవశాత్తు ఆయనకు గాయాలేం కాలేదు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నమామి గంగే ప్రాజెక్ట్ కింద గంగా నది పరిశుభ్రతను పరిశీలించడానికి ప్రధాని అక్కడికి వెళ్ళారు.

గంగానది ప్రక్షాళనపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ‘ నమామి గంగే ‘ పేరిట చేపట్టిన ప్రాజెక్టు పురోగతిమీద శనివారం కాన్పూర్ లో జరిగిన సమావేశంలో ఆయన సమీక్షించారు. ‘ నేషనల్ కౌన్సిల్ ఫర్ గంగ ‘ నిర్వహించిన తొలి సమావేశమిది.. ఈ మీటింగ్ లో యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, త్రివేంద్ర సింగ్ రావత్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ, ఇంకా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.