వాక్సిన్ ట్రయల్స్ కు వాలంటీర్‌గా మంత్రి… డిసెంబర్ 2న కొవాగ్జిన్ టీకా ట్రయల్స్… వేయి మందిపై ప్రయోగం…
కోవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం(62) కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు వాలంటీర్‌గా పేరు నమోదు చేసుకున్నారు.
west bengal minister firhad hakim volunteers for covid-19 vaccine clinical trial కోవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం(62) కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు వాలంటీర్‌గా పేరు నమోదు చేసుకున్నారు. కోల్‌కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజ్ (నైస్డ్)లో కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. కోవాక్సిన్ మొదటి డోస్ తీసుకునే వాలంటీర్‌గా మంత్రి నిలుస్తారని నైస్డ్ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మంత్రి హకీమ్ ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని తెలిపారు.
వేయి మంది వాలంటీర్లు…
కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానుండగా.. మంత్రితో పాటు పేరు నమోదు చేసుకున్న ఇతర వాలంటీర్లను హాజరు కావాలని తాము అభ్యర్థించినట్టు నైస్డ్ అధికారులు వెల్లడించారు. మూడో దశ ట్రయల్స్‌లో ఇక్కడ కనీసం 1,000 మంది వాలంటీర్లకు కోవాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడంపై మంత్రి హకీమ్ మాట్లాడుతూ.. ‘ప్రజలకు నేను సాయం చేయాలనుకుంటున్నాను. కోవిడ్-19కు చికిత్సలో నా సహకారం ప్రజలకు ఉపయోగపడితే చాలా సంతోషం. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌లో పాల్గొంటున్నాను’అని తెలిపారు.