నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి.. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ డిమాండ్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

Netaji Subhas chandra bose’s birthday as national holiday: అజాద్ హిందు పౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ సేవలు చిస్మరణీయమన్న మమతా వెంటనే ఆయన జయంతిని జాతీయసెలవు దినంగా ప్రకటించాలన్నారు. గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు తెలిపిన మమతా. నేతాజీకి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించింది. నేతాజీ జయంతి రోజున అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని మమత డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది స్వాతంత్య్ర సమరయోధుడి 125వ జయంతి వేడుకలను ఘనంగా జరుపనున్నట్లు సీఎం మమతా తెలిపారు.
‘‘స్వాతంత్ర్యం తరువాత నేతాజీ సుభాస్ చంద్రబోస్ కోసం మేము ఏమీ చేయలేదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. నేతాజీ సుభాస్ చంద్రబోస్ జన్మదినం జనవరి 23 ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్రానికి ఒక లేఖ రాశాను. ఇది నా డిమాండ్’’ అంటూ తాజాగా ట్వీట్టర్ వేదికగా మరోసారి షేర్ చేశారు పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ.
I personally feel we haven’t done anything important for Netaji Subhas Chandra Bose after independence. I’ve written a letter to Center to declare 23rd January, birth anniversary of Netaji Subhas Chandra Bose, as a national holiday. It is my demand: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/Lotng46RMt
— ANI (@ANI) January 4, 2021