AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ చల్లని కబురు.. 72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 72 గంటల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అబ్బ చల్లని కబురు.. 72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Weather Alert
Shaik Madar Saheb
|

Updated on: Jun 11, 2026 | 3:55 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.. ఓ వైపు ఎండలు దంచికొడుతుండంగా.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, నైరుతి రుతుపవనాలు(జూన్ 11) ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.. రాబోయే 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది..

ఏపీలో నైరుతి రుతుపవనాల జోరు కనిపిస్తుందని.. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణం చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మరో 72 గంటల్లో ఉత్తరాంధ్రలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ కొనసాగుతుందని.. దీంతో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఈ సంవత్సరం ఎల్ నినో కారణంగా, చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది.

కాగా.. ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి.. 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us