‘ ఆ పని మేమెప్పుడో చేసేసాం ‘.. ఇస్రో శివన్

చంద్రయాన్-2 మిషన్ కు సంబంధించిన ఆర్బిటర్… విక్రమ్ లాండర్ ఆచూకీని ఎప్పుడో కనుగొందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు. చెన్నైకి చెందిన షణ్ముగ సుబ్రహ్మణ్యన్ అనే ఇంజినీర్ చంద్రుని ఉపరితలం మీద విక్రమ్ శకలాలను కనుగొన్నానని, ఇందుకు అమెరికాలోని నాసా తనను అభినందించిందని చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాను మాట్లాడేదేమీ లేదని, అసలు ల్యాండ్ అయిన నాడే తమ వెబ్ సైట్.. సొంత ఆర్బిటర్ విక్రమ్ ఆచూకీని కనుగొందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని […]

' ఆ పని మేమెప్పుడో చేసేసాం '.. ఇస్రో శివన్
Follow us
Anil kumar poka

| Edited By: Srinu

Updated on: Dec 04, 2019 | 5:33 PM

చంద్రయాన్-2 మిషన్ కు సంబంధించిన ఆర్బిటర్… విక్రమ్ లాండర్ ఆచూకీని ఎప్పుడో కనుగొందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు. చెన్నైకి చెందిన షణ్ముగ సుబ్రహ్మణ్యన్ అనే ఇంజినీర్ చంద్రుని ఉపరితలం మీద విక్రమ్ శకలాలను కనుగొన్నానని, ఇందుకు అమెరికాలోని నాసా తనను అభినందించిందని చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాను మాట్లాడేదేమీ లేదని, అసలు ల్యాండ్ అయిన నాడే తమ వెబ్ సైట్.. సొంత ఆర్బిటర్ విక్రమ్ ఆచూకీని కనుగొందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని మేము మా వెబ్ సైట్ లో ఇదివరకే ప్రకటించాం.. కావాలంటే మా సైట్ చూడండి అన్నారాయన. రాజస్థాన్ లోని కిషన్ గఢ్ లో శివన్ మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇందులో షణ్ముగ సుబ్రహ్మణ్యన్ క్రెడిట్ ఏమీ లేదన్నట్టు అర్థమవుతోంది. నిజానికి చంద్రుని ఉపరితలంపై విక్రమ్ లాండర్ శకలాలను తాను కనుగొన్నట్టు షణ్ముగ చెప్పాడు. శివన్ మాత్రం ఆ లాండర్ గురించే వివరిస్తున్నారు. విక్రమ్ లాండర్ శకలాల గురించి ఆయన ప్రస్తావించలేదు.