పాలకులం కాదు.. మనం.. ప్రజా సేవకులం..!
ప్రజావేదికలో సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మనం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అంటూ.. సీఎం జగన్ చేసిన ప్రసంగంతో సోమవారం ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని, నవరత్నాల అమలే ప్రధాన ధ్యేయం కావాలని ఆయన అన్నారు. చరిత్రలో ఎన్నడూలేనంత విజయాన్ని ప్రజలు మనకు అందించారని.. ప్రభుత్వంలో అధికారులు కూడా భాగస్వాములేనని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టో అనేది భగవద్గీత లాంటిదని, […]

ప్రజావేదికలో సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మనం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అంటూ.. సీఎం జగన్ చేసిన ప్రసంగంతో సోమవారం ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని, నవరత్నాల అమలే ప్రధాన ధ్యేయం కావాలని ఆయన అన్నారు. చరిత్రలో ఎన్నడూలేనంత విజయాన్ని ప్రజలు మనకు అందించారని.. ప్రభుత్వంలో అధికారులు కూడా భాగస్వాములేనని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టో అనేది భగవద్గీత లాంటిదని, ఇందులోని ప్రతి హామీని నెరవేర్చి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జగన్ పిలుపునిచ్చారు. అందుకు అధికారుల సహకారం పూర్తిగా ఉండాలని వ్యాఖ్యానించారు.
ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందలి.. ముఖ్యంగా అణగారిన వర్గాలు, ఆర్థికంగా నిలబడేలా మన అడుగు ఉండాలన్నారు. పేదల జీవితాలు మార్చేందుకే నవరత్నాల పథకం తీసుకొచ్చామన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ చేరాలన్నారు. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు.. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మనవాళ్లే అని పేర్కొన్నారు జగన్. ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటరీని తప్పనిసరిగా నియమిస్తున్నామని.. అలాగే.. ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేస్తామన్నారు.