Helicopter Crash Video: ఆస్పత్రి బిల్డింగ్‌ను ఢీకొని కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి! వీడియో
ఆదివారం ఉదయం తుర్కిష్ లో ఘోర ప్రమాదం జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం వెళ్తున్న ఓ హెలికాఫ్టర్ దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా పక్కనే ఉన్న ఆస్పత్రి బిల్డింగ్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు లైలట్లు, ఓ వైద్యుడు, మరో వైద్య సహాయకుడు అక్కడికక్కడే మృతి చెందారు..
తుర్కిష్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వైద్యులతో బయలుదేరిన ఓ అంబులెన్స్ హెలికాప్టర్ కూలిపోయింది. టేకాఫ్ అయిన కాసేపటికే పక్కనే ఉన్న ఆసుపత్రి భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం నలుగురు మృతి చెందారు. ముగ్లా ప్రావిన్షియల్ గవర్నర్ ఇద్రిస్ అక్బియిక్ తెలిపిన వివరాల ప్రకారం..
తుర్కియేలోని అంతల్యా ప్రావిన్సులో ఉన్న ఓ రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు ముగ్లా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు హెలికాప్టర్‌లో బయలుదేరింది. ఇద్దరు పైలట్లు, ఓ వైద్యుడు, మరో వైద్య సహాయకుడు ఉన్నారు. అయితే అదే సమయంలో అక్కడ విపరీతమైన పొగ మంచు కురుస్తుంది. దీంతో హెలికాప్టర్ టేకాఫ్ అవుతున్న క్రమంలో పక్కనే ఉన్న ఆసుపత్రి భవనం నాలుగో అంతస్తును ఢీకొట్టింది. అదీంతో హెలికాఫ్టర్ నేలకూలింది. ఈ ఘటనలో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అక్బియిక్ చెప్పారు. ప్రమాద కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో హెలికాఫ్టర్ టేకాప్ అవడం, అది ఆసుపత్రి భవనం ఢీకొట్టడం, అనంతరం ఆస్పత్రి ముందు హెలికాప్టర్ శకలాలు చెల్లాచెదురుగా పడిపోవడం వీడియోల్లో కనిపిస్తుంది.
❗️🇹🇷 – In Turkey, an air ambulance helicopter crashed into a hospital building in the Mugla region, resulting in the deaths of four individuals.
The victims included two pilots and two medical workers, as reported by the Haber TV channel. The incident took place at a teaching… pic.twitter.com/WodY5zvx68
— 🔥🗞The Informant (@theinformant_x) December 22, 2024
కాగా డిసెంబరు 9న రెండు టర్కీ మిలటరీ హెలికాప్టర్లు ఆకాశంలోనే ఢీకొనడంతో అందులో ఉన్న ఆరుగురు సైనిక సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే.
Additional footage from scene of helicopter crash into hospital in Mugla, Türkiye https://t.co/ZJJErGHqPl pic.twitter.com/DDi92OaDdV
— Türkiye Today (@turkiyetodaycom) December 22, 2024