స్టేడియం బ్యూటీకి సోషల్ మీడియా ఫిదా

ఐపీఎల్ టోర్నీలో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు నిర్ధేశించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఈ సీజన్‌లో కోహ్లీ సేనకు ఇదే ఆఖరి మ్యాచ్. పైగా, పాయింట్ల పట్టిలో ఆర్సీబీ ఆఖరున ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక హైదరాబాదీలు కాస్త నిరాశగా ఫీల్ అవుతున్న […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:43 pm, Sun, 5 May 19
స్టేడియం బ్యూటీకి సోషల్ మీడియా ఫిదా

ఐపీఎల్ టోర్నీలో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు నిర్ధేశించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.

ఈ సీజన్‌లో కోహ్లీ సేనకు ఇదే ఆఖరి మ్యాచ్. పైగా, పాయింట్ల పట్టిలో ఆర్సీబీ ఆఖరున ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక హైదరాబాదీలు కాస్త నిరాశగా ఫీల్ అవుతున్న సమయంలో కనిపించింది ఓ మిస్టిరియస్ బ్యూటీ. తన క్యూట్ లుక్స్‌తో క్రికెట్ ప్రేమికుల మతిపొగొట్టింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కెమెరాలు ఈ బ్యూటీని కవర్ చేయగా, ఆ సమయంలో ఆమె హావభావాలకు నెటిజన్స్ ఫిదా అయిపోయారు. ఆర్సీబికి మద్దతుగా వచ్చిన ఆ యువతి మ్యాచ్ జరిగినంత సేపు గ్యాలరీలో తోటి ప్రేక్షకులతో కలిసి సందడి చేసింది. బెంగళూరు మ్యాచ్ గెలిచి అభిమానులకు ఆనందం తెచ్చి పెడితే… ఈ ముద్దుగుమ్మ మాత్రం తన బ్యూటీతో అక్కడికి వచ్చిన ప్రేక్షకులతో పాటు నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇంటర్నెట్‌లో ఎవరీ మ్యాజిక్ బ్యూటీ అంటూ నెటిజన్స్ సెర్చ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ టీనేజ్ గర్ల్  ఓవర్ నైట్‌స్టార్‌గా అవతరించింది.

దొరికేవరకు నెటిజన్ల ఊరుకుంటారా?..బ్యూటీ డీటేల్స్ కోసం అన్ని సోషల్ మీడియా వేదికల్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. మొత్తానికి ఆమెను పట్టేశారు. ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ద్వారా యువతి పేరు దీపిక ఘోష్‌గా గుర్తించారు. దాంతో ఈ బ్యూటీ అందాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు.అంతేకాదు అంతకుముందు ఆమె ఇన్‌స్టా ఫాలోవర్లు 5వేలు కాగా ప్రస్తుతం ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాల లక్షా యాబై ఏడు వేల మంది. కన్నుగీటి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ప్రియ ప్రకాష్ వారియర్‌ను మరిచిపోకముందే ఇప్పుడు దీపిక ఘోష్ సోషల్ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది. సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీ మిమిలతో హీటెక్కిపోయింది.

 

View this post on Instagram

 

And the Award goes to cameraman . New nationl crush😍😍😍😍#crush #rcb #troll #trollguru_official #nam banglore

A post shared by troll macha (@nam_troll_adda) on