ట్రైను లేటు..’నీట్’ మిస్ అయిన 500మంది విద్యార్థులు
భారతీయ రైల్వే దుస్థితి గురించి చెప్పడానికి మరో సంఘటన అద్దం పట్టింది. తాజాగా కర్ణాటకలో ఓ రైలు ఆలస్యానికి దాదాపు 500 మంది విద్యార్థుల భవిష్యత్ సందిగ్ధంలో పడిపోయింది. రైలు కారణంగా ఏకంగా 500 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది. బళ్ళారి, హుబ్లికి చెందిన దాదాపు 500 మంది విద్యార్థులకు బెంగళూరు సెంటర్ వేశారు. ఇవాళ ఉదయం 7 గంటలకు నగారానికి చేరే హంపి ఎక్స్‌ప్రెస్‌ను వీరు ఎక్కారు. 16591 హంపి […]

భారతీయ రైల్వే దుస్థితి గురించి చెప్పడానికి మరో సంఘటన అద్దం పట్టింది. తాజాగా కర్ణాటకలో ఓ రైలు ఆలస్యానికి దాదాపు 500 మంది విద్యార్థుల భవిష్యత్ సందిగ్ధంలో పడిపోయింది. రైలు కారణంగా ఏకంగా 500 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది. బళ్ళారి, హుబ్లికి చెందిన దాదాపు 500 మంది విద్యార్థులకు బెంగళూరు సెంటర్ వేశారు. ఇవాళ ఉదయం 7 గంటలకు నగారానికి చేరే హంపి ఎక్స్‌ప్రెస్‌ను వీరు ఎక్కారు. 16591 హంపి ఎక్స్‌ప్రెస్ ఇవాళ ఉదయం 7 గంటలకు రావాల్సి ఉండగా, మధ్యాహ్నం 2.30కిగాని అంటే ఆరు గంటల ఆలస్యంతో రైలు బెంగళూరు చేరింది. అక్కడి నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ దయానంద్ సాగర్ కాలేజీకి వీరు చేరుకోవాల్సి ఉంది. 2 గంటలు దాటితే పరీక్ష హాల్‌లోకి విద్యార్థులను రానివ్వరు. అంటే వీరందరూ ఇవాళ పరీక్ష రాసే అవకాశం లేదు. దీంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రికి చాలామంది విద్యార్థులు అత్యవసర మెసేజ్‌లు పంపించారు. తమకు పరీక్ష రాసేందుకు అనుమతించాలని వీరు కోరుతున్నారు.
సిద్ధరామయ్య ట్వీట్:
రైల్వే వైఫల్యం వల్ల విద్యార్థులు నీట్ పరీక్షకు గైర్హాజరవడంతో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్రంపై మండిపడ్డారు. ‘ఇతరులు సాధించిన దానికి కూడా తమ గొప్పలుగా చెప్పుకునే మోదీ.. ఇలాంటి వైఫల్యాలకు కూడా నువ్వు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రైళ్లు సకాలంలో నడవకపోవడం వల్ల కర్ణాటకలో వందలాది మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షకు గైర్హాజరైన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలి’ అని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Mr. @narendramodi,
You pat your own back for others’ achievements but will you also take the responsibility for your cabinet min’ incapabilities.
Hundreds of students in Karnataka may not be able to take up NEET because of delay in the train services. 1/2
— Siddaramaiah (@siddaramaiah) May 5, 2019
Mr. @narendramodi,
Ask @PiyushGoyal to work properly for next few days and then we will set it right. Also, ensure that the aggrieved students get another chance to write NEET exam. 2/2
— Siddaramaiah (@siddaramaiah) May 5, 2019




