Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన ప్రాంతం
భారీ కొండచరియలు విరిగిపడితే ఎంత విధ్వంసం చోటు చేసుకుంటుందో ఎప్పుడైనా చూశారా? కనీసం టీవీలో వీడియో అయినా చూశారా? భారీగా ఉన్న కొండలు అంత ఎత్తు నుంచి కూలి పడిపోతే ఎంత భయానకంగా ఉంటుందో అసలు ఊహించలేం. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అదే జరిగింది. ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై అకస్మాత్తుగా పెద్ద కొండచరియలు విరిగిపడడంతో ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.
ఉత్తరాఖండ్ ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై ఉన్న పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విరిగిపడుతున్న రాళ్ల భాగాలు, మట్టితో ఆ ప్రాంతమంతా భయంకర వాతావరణం నెలకొంది. ఈ రహదారి చైనా సరిహద్దును కలుపుతుంది. ఉవ్వెతున ఎగిసిపడుతున్నట్లుగా కొండలో ఒక వైపు భాగం నుంచి కొంత విరిగిపడడం మనం చూడొచ్చు. ఇలాంటి ఎత్తైన కొండలు ఉన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే.. భారీ కొండచరియ విరిగిపడుతున్నప్పుడు కొందరు ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న BRO బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ధార్చుల గుంజి హైవే నుంచి BRO బృందాలు చెత్తను తొలగించే పని నిమగ్నమై ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..