AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రస్ట్ గేమ్‌లో షాకిచ్చిన లవర్.. సెకన్లలో మారే సంబంధాలంటూ నెటిజన్ల కామెంట్లు..! వైరలవుతోన్న వీడియో

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్‌గా మారాయి. కొన్ని నవ్వించగా, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. కానీ, ఈ వీడియో మాత్రం మిమ్మల్ని నవ్వించడంతోపాటు ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది.

Viral Video: ట్రస్ట్ గేమ్‌లో షాకిచ్చిన లవర్.. సెకన్లలో మారే సంబంధాలంటూ నెటిజన్ల కామెంట్లు..! వైరలవుతోన్న వీడియో
Viral Video
Venkata Chari
|

Updated on: Jul 25, 2021 | 1:37 PM

Share

Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్‌గా మారాయి. కొన్ని నవ్వించగా, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇదే సమయంలో కొన్ని వీడియోలు పాఠాలు నేర్పిస్తుంటాయి. మరికొన్ని నెటిజన్ల హృదయాలను తాకుతుంటాయి. కానీ, ఈ వీడియో మాత్రం మిమ్మల్ని నవ్వించడంతోపాటు ఆశ్చర్యపరుస్తుంది కూడా. ఇద్దరి మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు పలు ఆటలను ఆడుతుంటాయని మనం చూస్తునే ఉంటాం. వాటిలో ఒకటి ట్రస్ట్ గేమ్. దీంతో ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన వస్తుందని ఆశపడుతుంటారు. అలాంటి రకానికే చెందుతుంది ఈ వీడియో.వివరాల్లోకి వెళ్తే.. ఇందులో అబ్బాయి, అమ్మాయి ఏదో ఒక ఫంక్షన్‌లో ట్రస్ట్ గేమ్ ఆడుతుంటారు. ఇద్దరూ మాట్లాడుకొని గేమ్‌కు రెడీ అయినట్లు ఓకే కూడా చెప్పుకుంటారు. ఈమేరకు అమ్మాయి వేదికపై నిలబడి తనను కిందపడిపోకుండా పట్టుకోవాలంటూ అబ్బాయిని కోరుతుంది. సరే అంటే అమ్మాయి వెనకకు తిరిగి గేమ్ ఆడేందుకు సిద్ధమవుతుంది. ఇంతలో ఏమైందో కానీ, అబ్బాయి మాత్రం తనను పట్టించుకోకుండా మరో అమ్మాయితో వెళ్లిపోతుంటాడు. ఇది గమనించిన అమ్మాయి అమాంతం కిందపడిపోతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు మాత్రం ఇలా చేశావేంటంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో చాలా మంది ఇష్టపడుతున్నారు. అలాగే చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు కూడా చేశారు. ఇది నిజంగా చాలా ఫన్నీగా ఉందంటూ కొందరు, ప్రేమ గుడ్డిది అంటూ మరొకరు కామెంట్లు చేశారు. అలాగే సెకన్లలో మారిపోయే బంధాలంటే ఇవేనంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ వీడియోను నిరంజన్ మోహపాత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో (ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో) షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో17 వేలకు పైగా వ్యూస్‌తో దూసుకపోతోంది.

Also Read:

Viral Video: 43 బంతుల్లో 92 పరుగులు.. పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా ఉమెన్స్ ప్లేయర్.. ఇది బౌలర్లపై దండయాత్రే అంటూ నెటిజన్ల కామెంట్లు

Viral Video: స్టేజ్‌పైనే వరుడికి చెమటలు పట్టించిన వధువు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!