నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆగష్టులో సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు ఏర్పాట్లు..!

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆగష్టులో సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు ఏర్పాట్లు..!
Follow us

|

Updated on: Jun 22, 2020 | 8:43 AM

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆగష్టు 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాత పరీక్షలను జరపాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను సిద్దం చేసి.. ప్రభుత్వం అనుమతుల కోసం పంపించింది. అంతేకాకుండా ఈ నెల 28 నాటికి పరీక్షా కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

కాగా 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలపై కొద్దిరోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడనుంది.