చంద్రబాబు గారికి ఆరో కేటగిరి ఫోబియానేమో..?: విజయసాయి రెడ్డి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో గుర్తించిన ఫొబియాలను సైకాలజీ 5కేటగిరీలుగా విభజించిందని.. అదే చంద్రబాబు గారికి సైకియాట్రిక్ పరీక్షలు చేస్తే ఆరో కేటగిరి కూడా ఉందని తేలుతుందని ఆయన విమర్శించారు. ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కలప, పులివెందులలాగా మారుస్తున్నారని పదేపదే తన అకారణ భీతిని ఆయన వ్యక్తం చేస్తుంటారని ఘాటు విమర్శలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో గుర్తించిన ఫోభియాలను సైకాలజీ […]

చంద్రబాబు గారికి ఆరో కేటగిరి ఫోబియానేమో..?: విజయసాయి రెడ్డి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 06, 2019 | 3:17 PM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో గుర్తించిన ఫొబియాలను సైకాలజీ 5కేటగిరీలుగా విభజించిందని.. అదే చంద్రబాబు గారికి సైకియాట్రిక్ పరీక్షలు చేస్తే ఆరో కేటగిరి కూడా ఉందని తేలుతుందని ఆయన విమర్శించారు. ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కలప, పులివెందులలాగా మారుస్తున్నారని పదేపదే తన అకారణ భీతిని ఆయన వ్యక్తం చేస్తుంటారని ఘాటు విమర్శలు చేశారు.

అలాగే అవినీతి కేసుల్లో లోపల వేస్తారేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తొస్తుందని అన్నారు. తనను అరెస్ట్ చేస్తే చుట్టూ నిలబడి రక్షణ కల్పించాలని గతంలో ప్రజలను వేడుకున్నారని గుర్తుచేశారు. తనకేదైనా అయితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేదని ఇప్పుడు బెదిరిస్తున్నారని.. దాడి నాటకానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు.