AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయనున్న ‘ఫైటర్’.. ఆరోజు నుంచి చిత్రీకరణలో పాల్గొననున్న విజయ్..

చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్‏తో మళ్లీ తన ఫాంలోకి వచ్చాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో

Vijay Devarakonda: మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయనున్న 'ఫైటర్'.. ఆరోజు నుంచి చిత్రీకరణలో పాల్గొననున్న విజయ్..
Rajitha Chanti
|

Updated on: Jan 06, 2021 | 9:49 PM

Share

చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్‏తో మళ్లీ తన ఫాంలోకి వచ్చాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాను తెరకెక్కించనున్నట్లుగా గతంలో ప్రకటించాడు. ఇందులో విజయ్‏కు జోడీగా అనన్య పాండే నటిస్తుంది. ఇక ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయడానికి పూరి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ ఫైటర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ కొద్ది రోజులకే కరోనా ప్రభావంతో చిత్రీకరణ వాయిదా పడింది. అటు థియేటర్లను ఓపెన్ చేయడానికి తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలు అనుమతించిన ఈ సినిమా మాత్రం షూటింగ్ ప్రారంభం కాలేదు. తాజాగా ఈ మూవీ తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి పూరి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. జనవరి 20 నుంచి ఫైటర్ చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. వీలైనంత తొందరగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసేలాగా పూరీ జగన్నాథ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

Also Read: నాని దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా.. ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు..

మరో కొత్త అవతారం ఎత్తనున్న పూరి జగన్నాథ్.. పూరీతో సరికొత్త టాక్ షో ప్లాన్ చేస్తోన్న ప్రముఖ మీడియా సంస్థ.?