Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidura Niti: ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ఆయుష్షు తగ్గుతుందంటున్న విదురుడు.. వెంటనే మార్చుకోండి..

నేటి జీవనశైలి, తినే ఆహారం మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే మానవులలోని కొన్ని చెడు లక్షణాలు కూడా మరణానికి దగ్గరగా తీసుకుని వెళ్తాయట. విదురుడు తన నీతిలో ఈ విషయం గురించి ప్రస్తావించాడు. అంతేకాదు ఈ చెడు లక్షణాలను తగ్గించుకుని తమ ఆయుష్షును పెంచుకోవాలని ప్రజలకు సలహా ఇచ్చాడు. కనుక ఈ రోజు ఒక వ్యక్తి జీవితకాలాన్ని తగ్గించే చెడు లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..

Vidura Niti: ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ఆయుష్షు తగ్గుతుందంటున్న విదురుడు.. వెంటనే మార్చుకోండి..
Vidura Niti In Telugu
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2025 | 9:54 AM

పుట్టిన ప్రతి జీవికి మరణం ఖాయం.ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే విదురుడు మనిషిలోని కొన్ని చెడు లక్షణాలు వారి ఆయుష్షును తగ్గించి మరణానికి దగ్గరగా తీసుకుని వెళ్తాయని చెప్పాడు. కనుక దీర్ఘాయుష్షుతో జీవించడానికి మనలోని కొన్ని చెడు లక్షణాలను విడిచి పెట్టడం మంచిదని సూచించాడు. ఆ చెడు లక్షణలు ఏమిటో తెలుసుకుందాం..

  1. మితిమీరిన కోపం: కోపం అందరికీ వస్తుంది. అయితే కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కోపంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి తద్వారా తప్పులు చేసే అవకాశం ఎక్కువ. అంతేకాదు ఎవరైనా సరే కోపంగా ఉన్నప్పుడు ఏది తప్పు? ఏది ఒప్పు అనే విషయాన్నీ చెప్పలేరు. కనుక ఆ సమయంలో చెడు పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అతి కోపం అనర్ధానికి హేతువు. అంతేకాదు ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. కనుక మనిషి కోపాన్ని తగ్గించుకుని.. ఓపికగా ఉండటం అలవాటు చేసుకోవాలని సూచించాడు విదురుడు.
  2. అహంకారం: తనకి తానే ఉన్నతుడనే భావన కూడా వ్యక్తి వినాశనానికి దారితీస్తుంది. అహంకారి, తాను మాత్రమే కరెక్ట్ అని భావించే వ్యక్తి పెద్దలు చెప్పిన సలహా వినడు. అంతేకాదు తమకన్నా పెద్దవారిని అవమానిస్తారు. అహంకారి అయిన వ్యక్తి తనకి తాను గొప్పవాడినని భావిస్తూ నచ్చిన విధంగా నడుచుకుంటాడు. అలాంటి వ్యక్తి ఆయుష్షు తగ్గిపోతుందని విదురుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు.
  3. స్వార్థం: ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా స్వార్థపరుడే. అయితే స్వార్థపూరిత వైఖరితో ఇతరులను ఉపయోగించుకుని వదిలివేసేలా చేస్తుంది. అంతేకాదు తన సుఖం సంతోషాన్ని మాత్రమే కోరుకునే స్వార్ధపరుడు విదురుడు చెప్పినట్లుగా మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించలేడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులను తనకు నచ్చిన విధంగా తనకోసం ఉపయోగించుకుంటాడు. ఈ గుణం వ్యక్తీ జీవితకాలాన్ని ఈ గుణం తగ్గిస్తుంది.
  4. అతిగా మాట్లాడితే : కొంతమంది తమ మాటలతో కోటలు కట్టేస్తారు. అంతేకాదు అబద్ధాలు చెబుతారు. తమ మాటలతో ఇతరుల మనోభావాలను గాయపరుస్తారు. కనుక మాటలను అదుపులో ఉంచుకోవాలి. అవసరం అయినంత వరకే మాట్లాడాలి. అతిగా మాట్లాడితే అతని ఆయుర్దాయం తగ్గుతుందని విదురుడు చెప్పాడు.
  5. స్వార్ధం ఉన్న వ్యక్తులు: నేటి కాలంలో త్యాగ గుణం ఉన్న వ్యక్తులను చూడటం చాలా అరుదు. ఏది చూసినా తనకు కావాలి.. తాను కోరుకున్నది జరగాలి అని అలోచించేవారే ఎక్కువ. ఇలాంటి స్వార్ధం గుణం ఉన్న వ్యక్తులు ఆయుస్సు కూడా తగ్గి మరణానికి దగ్గర అవుతారని విదురుడు పేర్కొన్నాడు.
  6. కనుక అప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా సరే మనిషికి స్వార్ధం చింతన లేకుండా సంతృప్తితో జీవిస్తూ..తనకు వీలునైనంత సహాయం చేసే లేదా త్యాగం చేసే గుణం కలిగి ఉండాలి. అప్పుడే జీవినంత కాలం సుఖ సంతోషాలతో ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు