Swapna Shastra: కలలో అందాల పక్షి నెమలి కనిపించడానికి అర్ధం ఉంది.. ఎలా కనిపిస్తే ఎటువంటి అర్ధం అంటే..
ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు వస్తాయి. వాటిల్లో కొన్ని కలలు మధురంగా ఉంటే.. కొన్ని కలలు భయపెట్టేవిగా ఉంటాయి. అయితే మీ కలలో చూసే ప్రతి సంఘటనకు ఒక అర్ధం ఉంటుందని స్వప్న శాస్త్రం పేర్కొంది. ప్రతి కల వెనుక భవిష్యత్తు గురించి ఒక రహస్య సూచన ఉంటుంది. కలలో కనిపించే కొన్ని వస్తువులు, జంతువులు, పక్షులు లేదా దేవుళ్ళు కూడా భవిష్యత్తు ఎలా ఉంటాయో తెలియజేస్తాయట. అవి కలలో మీకు ఏమి జరగబోతోందో చెబుతాయట.
Updated on: Mar 27, 2025 | 10:40 AM

రాత్రి నిద్ర పోయే సమయంలో కలలు కనడం సర్వసాధారణం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రజలు వివిధ రకాల కలలను కంటారు. ఆ కలలో వేరువేరు సంఘటనలు చూస్తారు. అయితే ఇలా రాత్రి సమయంలో వచ్చే కలలు.. కొన్ని సందర్భాల్లో నిజం అయినవి కూడా ఉంటాయి. ఒకొక్కసారి రాత్రి వచ్చిన కల.. రోజంతా గుర్తుకొస్తు కనుల ముందే ఉంటుంది. అయితే కొన్ని కలలు మెలకువ వచ్చిన తర్వాత అసలు గుర్తుకు రావు. కొన్ని కలలను గుర్తు చేసుకున్నా భయపడతారు. ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఏదోక అర్ధం ఉంది.

ప్రతి కల వెనుక భవిష్యత్తు గురించి ఒక రహస్య సూచన ఉంటుంది. ఆ కల ద్వారా మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, రాబోయే రోజుల్లో మీకు ఏమి జరగబోతోందో చెబుతుంది. అదే విధంగా నిద్రపోతున్న సమయంలో మీ కలలో నెమలి కనిపిస్తే.. అది కూడా నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తే ఆ కలకు కూడా ఒక అర్థం ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది. ఈ రోజు కలలో నెమలిని కనిపించడం వెనుక ఉన్న అర్ధం ఏమిటో తెలుసుకుందాం..

స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో నెమలిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని అర్థం జీవితంలోకి ఆనందం రాబోతోంది. అలాగే డబ్బుని నాలుగు విధాలుగా సంపాదించడానికి మార్గం దొరుకుతుందని ఈ కల సూచిస్తుందట.

కలలో జంట నెమలులు కలిసి కనిపిస్తే.. అటువంటి కల చాలా శుభప్రదమైన కల. ఆడ, మగ నెమలి కనిపిస్తే ఆ కలకి అర్ధం ఏమిటంటే మీరు త్వరలో వివాహం చేసుకోబోతున్నారని అర్ధం.. ఒకవేళ మీకు వివాహం జరిగి ఉంటే మీ వైవాహిక జీవితంలోకి ఆనందం వస్తోందని అర్ధం. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి.

కలలో తెల్లటి నెమలిని చూసినట్లయితే లక్ష్మీ దేవి మీ పట్ల దయ చూపిందని అర్థం. మీ జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు, సంపద వెల్లివిరియబోతున్నాయి. స్వప్న శాస్త్రంలో, తెల్ల నెమళ్లను ఆర్థిక స్థితికి సూచికగా పరిగణిస్తారు. కలలో తెల్ల నెమలి కనిపించడం అంటే పేదరికం నుంచి బయట పడనున్నారని అర్ధం.

డ్యాన్స్ చేస్తున్న నెమలి: ఆనందంగా నృత్యం చేస్తున్న నెమలి లేదా నెమలి వేషంలో నృత్యం చేస్తున్నట్లు కల వస్తే అది చాలా శుభ సంకేతం. ఇలాంటి కలకు అర్ధం ఏమిటనే.. రాబోయే రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పులు జరగబోతున్నాయని అట. అంతేకాదు డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. జీవితంలోని అన్ని సమస్యలు క్రమంగా తొలగిపోతాయని నమ్మకం.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నల్ల నెమలి కనిపిస్తే.. మీరు అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కల చెడ్డ శకునము. రాబోయే రోజుల్లో మీకు ఏదైనా పెద్ద అపరాకారం జరగనుందని దీని అర్థం . కనుక ఇలా నల్ల నెమలి కనిపిస్తే ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి.





























