Viral Video: వామ్మో..! ఇంత పెద్ద కోబ్రాను మీ లైఫ్‌లో చూసి ఉండరు
సాధారణంగా పాము కనిపిస్తే భయపడేవాళ్లు ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే పామును మీరు ఫోన్‌లో చూసినా కూడా ఒక్క క్షణం.....
సాధారణంగా పాము కనిపిస్తే భయపడేవాళ్లు ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే పామును మీరు ఫోన్‌లో చూసినా కూడా ఒక్క క్షణం గగుర్పాటు కలుగుతుంది. అందుకు కారణం దాని సైజ్. ఇప్పటివరకు అలాంటి పాము మీకు కనిపించి ఉండదు. ప్రస్తుతం ఈ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం కిరినగర్ ప్రాంతంలో ఈ భారీ కోబ్రా తన కలుగులోంచి బయటకు వచ్చే దృశ్యం కనిపించడంతో.. కొందరు చిత్రీకరించారు. అది కాస్తా ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా హిమాచల్ ప్రదేశ్‌లో అడవుల్లో నివశించే పలు తెగల వ్యక్తులు తాము ఇప్పటివరకు పొడవైన విషపూరిత పాము ఇదే అని చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఇంతవరకు ఇంత పొడవైన కోబ్రాను తమ ప్రాంతంలో చూడలేదు అంటున్నారు. ఒకటిన్నర నిమిషాలు ఉన్న ఈ వీడియోలో, పాము ప్రాకుతూ కొండలపైకి వెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో తెగ సర్కులేట్ అవుతుంది. నెటిజన్లు షేర్లు, కామెంట్లతో హెరెత్తిస్తున్నారు. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి.
One of the longest #KingCobra sighted in recent times near the Girinagar area of Paonta Sahib in Sirmaur district in #HimachalPradesh@SaevusWildlife @moefcc@WWFINDIA pic.twitter.com/BNG6hZwjg5
— DD News (@DDNewslive) June 6, 2021
Also Read: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఐదో తరగతి విద్యార్థిని లేఖ.. స్పందించిన సీజేఐ