ఉపసర్పంచ్ దారుణ హత్య.. భూ వివాదమే కారణమా..?
నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చందం పేట మండలం గుంటిపల్లిలో ఉపసర్పంచ్ రమావత్ లాల్యా పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రగాయాలతో లాల్యా ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. లాల్యాను రాజు అనే వ్యక్తి హత్యచేశాడంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భూ వివాదం కారణంగా వీరి మధ్య ఘర్షణ జరిగిందని వారు తెలిపారు. భూ వివాదం కారణంగానే లాల్యాను చంపేశారని ఆరోపించారు. మృతదేహంతో రాజు ఇంటివద్ద నిరసన చేపట్టి.. అతడి […]
నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చందం పేట మండలం గుంటిపల్లిలో ఉపసర్పంచ్ రమావత్ లాల్యా పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రగాయాలతో లాల్యా ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. లాల్యాను రాజు అనే వ్యక్తి హత్యచేశాడంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భూ వివాదం కారణంగా వీరి మధ్య ఘర్షణ జరిగిందని వారు తెలిపారు. భూ వివాదం కారణంగానే లాల్యాను చంపేశారని ఆరోపించారు. మృతదేహంతో రాజు ఇంటివద్ద నిరసన చేపట్టి.. అతడి ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.