వైఎస్‌లాగే జగన్‌కు కూడా ఎంతో ప్రేమ: ఆర్. కృష్ణయ్య

విజయవాడ: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను వైసీపీ బీసీ విభాగం నాయకులు కలిశారు. ఈ నెల 17న ఏలూరులో జరగనున్న బీసీ గర్జన సభకు హాజరు కావాల్సిందిగా కోరారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ 40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న ఆర్. కృష్ణయ్యను బీసీ గర్జనకు ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ను ఆర్. కృష్ణయ్య ప్రశంసించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలానే జగన్‌కు కూడా బీసీలంటే ఎంతో […]

వైఎస్‌లాగే జగన్‌కు కూడా ఎంతో ప్రేమ: ఆర్. కృష్ణయ్య

విజయవాడ: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను వైసీపీ బీసీ విభాగం నాయకులు కలిశారు. ఈ నెల 17న ఏలూరులో జరగనున్న బీసీ గర్జన సభకు హాజరు కావాల్సిందిగా కోరారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ 40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న ఆర్. కృష్ణయ్యను బీసీ గర్జనకు ఆహ్వానించినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా జగన్‌ను ఆర్. కృష్ణయ్య ప్రశంసించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలానే జగన్‌కు కూడా బీసీలంటే ఎంతో ప్రేమ అని అన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దేశ వ్యాప్తంగా 36 పార్టీలను కోరగా అందులో స్పందించింది ఒక్క వైసీపీయేనని చెప్పారు. బీసీలు ఏది అడిగితే అది వైఎస్ ఇచ్చారని, జగన్ కూడా తండ్రికి తగ్గ తనయుడని కృష్ణయ్య కొనియాడారు.

Published On - 6:51 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu