బిగ్‌బీకి దాదా సాహెబ్ ఫాల్కే!
బాలీవుడ్ కింగ్ అమితాబ్ బచ్చన్ భారత చలన చిత్ర సీమలో గౌరవప్రదమైన, అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. భారతీయ సినిమా రంగానికి విశిష్టసేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది. అవార్డు అందకుంటున్న సమయంలో ఆయన వెంట భార్య జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. […]

బాలీవుడ్ కింగ్ అమితాబ్ బచ్చన్ భారత చలన చిత్ర సీమలో గౌరవప్రదమైన, అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. భారతీయ సినిమా రంగానికి విశిష్టసేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది. అవార్డు అందకుంటున్న సమయంలో ఆయన వెంట భార్య జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ అభినందిస్తూ ట్వీట్ చేశారు.
కాగా.. అమితాబ్ మాట్లాడుతూ.. అవార్డు అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే నిజానికి ఆయన అవార్డును డిసెంబర్ 23వ తేదీనే అందుకోవాలి. అప్పుడు అనారోగ్యంగా ఉన్నందున అమితాబ్ ఈ రోజున తీసుకున్నారు. కాగా.. ఈనెల 23వ తేదీన జాతీయ అవార్డులు అందుకున్న వారందరికీ రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు.
Delhi: Veteran actor Amitabh Bachchan receives Dadasaheb Phalke Award from President Ram Nath Kovind. pic.twitter.com/9Towgcgo9x
— ANI (@ANI) December 29, 2019