బిగ్ బాస్ హౌస్ ఊడ్చిన సల్మాన్.. కంటెస్టెంట్లపై గుస్సా.. వీడియో వైరల్!
బిగ్ బాస్ షోకు హోస్టుగా వ్యవహరించాలంటే మాటలు కాదు.. ఒక వైపు కంటెస్టెంట్ల గొడవలు, మరోవైపు ప్రేక్షకుల నుంచి విమర్శలు రెండింటిని కూడా సమపాళ్లలో విశ్లేషించి తగిన న్యాయం చేసిన అతడే బిగ్ బాస్‌కు హోస్టుగా చేయగలడు. ఎంత కోపం ఉన్నా.. సరైన సమయంలో దాన్ని బయటపెడుతూ.. బాలీవుడ్ కండలవీరుడు మరోసారి తాను ఎందుకని ఇన్నాళ్లు బిగ్ బాస్‌కు హోస్టుగా వ్యవహరించానో అనడానికి కారణాన్ని వివరించాడు. పైగా మరే హోస్టు ఇంతవరకు చేయని పనిని చేసి చూపాడు. […]

బిగ్ బాస్ షోకు హోస్టుగా వ్యవహరించాలంటే మాటలు కాదు.. ఒక వైపు కంటెస్టెంట్ల గొడవలు, మరోవైపు ప్రేక్షకుల నుంచి విమర్శలు రెండింటిని కూడా సమపాళ్లలో విశ్లేషించి తగిన న్యాయం చేసిన అతడే బిగ్ బాస్‌కు హోస్టుగా చేయగలడు. ఎంత కోపం ఉన్నా.. సరైన సమయంలో దాన్ని బయటపెడుతూ.. బాలీవుడ్ కండలవీరుడు మరోసారి తాను ఎందుకని ఇన్నాళ్లు బిగ్ బాస్‌కు హోస్టుగా వ్యవహరించానో అనడానికి కారణాన్ని వివరించాడు. పైగా మరే హోస్టు ఇంతవరకు చేయని పనిని చేసి చూపాడు.
హిందీ బిగ్ బాస్‌లో ప్రస్తుతం సీజన్ 13 జరుగుతోంది. ఇక హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ప్రతి చిన్న ఇష్యూకు గొడవ పడటం జరుగుతోంది. సల్మాన్ ఎన్నిసార్లు వీకెండ్‌లో వాళ్లకు నచ్చజెప్పినా.. మళ్ళీ షరా మాములుగా కొట్టుకుని అటు నిర్వాహకులకు.. ఇటు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందంటారు.. ఇక్కడ హౌస్‌మేట్స్ కూడా ఆ హద్దు దాటేశారు. అందుకే సల్మాన్ ఖాన్ హౌస్‌లోకి అడుగుపెట్టి వంటగదిని, బాత్‌రూమ్‌ను శుభ్రం చేశాడు.
కంటెస్టెంట్లు తిన్న ప్లేట్లను శుభ్రం చేయడమే కాకుండా వంటగదిని కూడా సల్మాన్ ఖాన్ క్లీన్ చేశాడు. అంతేకాకుండా బాత్‌రూమ్‌ను కూడా శుభ్రం చేసి ఒక విధంగా సంచలనమే సృష్టించాడు. కొన్నివారాలుగా హౌస్‌మేట్స్ నిర్లక్ష్యానికి సల్మాన్ విసిగిపోయి.. షో నుంచి తాను తప్పుకుంటానని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. ఇక సల్మాన్ శుభ్రం చేస్తున్న సమయంలో కంటెస్టెంట్లు అతడికి క్షమాపణలు చెబుతున్నా.. వినిపించుకోలేదు.. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏది ఏమైనా ఓ స్టార్ హీరో ఇలా చేయడం అందరిని షాక్‌కు గురి చేసిందని చెప్పాలి.