AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Key Movie Remake: కొరియన్ రీమేక్‏లో వెంకటేష్ ?.. క్రైమ్ ఎంటర్‏టైనర్‏గా రానున్న విక్టరీ..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సంస్థ ‘సురేష్ ప్రొడక్షన్స్’. నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్

Lucky Key Movie Remake: కొరియన్ రీమేక్‏లో వెంకటేష్ ?.. క్రైమ్ ఎంటర్‏టైనర్‏గా రానున్న విక్టరీ..
Rajitha Chanti
|

Updated on: Jan 22, 2021 | 3:36 PM

Share

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సంస్థ ‘సురేష్ ప్రొడక్షన్స్’. నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకుల మందుకు తీసుకువచ్చారు. ఇండస్ట్రీలో రీమేక్ సినిమాల జోరు పెరిగిపోతుంది. ఇటీవలే ఈ నిర్మాణ సంస్థ కొరియన్ భాషకు చెందిన ‘లక్కీ కీ’ అనే మరో సినిమాను రీమేక్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్‏టైనర్‏గా ఉండే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఇండియన్ భాషల రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లుగా సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవలే తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త గురించి ఫిల్మ్ నగర్లో చర్చలు నడుస్తున్నాయి.

ఇక గతంలో సురేష్ ప్రొడక్షన్స్ మరియు గురు ఫిల్మ్ సంయుక్తంగా ‘ఓ బేబీ’ సినిమాను నిర్మించారు. అయితే ఇది కూడా కొరియన్ సినిమా మిస్ గ్రానీ ఆధారంగానే రూపొందించారు. ఇక దీనికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక ఇందులో హీరోయిన్ సమంత మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించిగా.. బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ సాధించింది. తాజాగా మరోసారి సురేష్ ప్రొడక్షన్స్ మరియు గురు ఫిల్మ్ కలిసి కొరియన్ సినిమా లక్కీ కీ రీమేక్ చేస్తుండగా.. హీరో వెంకటేష్.. సురేష్ ప్రొడక్షన్స్‏కు తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 2016లో దక్షిణ కొరియాలో యాక్షన్ కామెడీ సినిమాగా లక్కీ కీ మంచి విజయం సాధించింది.

Also Read:

తెలుగులో రీమేక్ కానున్న ‘కొరియన్’ సినిమా.. అధికారికంగా ప్రకటించిన పాపులర్ నిర్మాణ సంస్థ.. త్వరలోనే షూటింగ్..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు