“ఆయన సింహం”..రఘురామకృష్ణంరాజుపై వర్మ ట్వీట్
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఈయనకు ఏం అనిపిస్తే అది చేస్తుంటారు. తనకు నచ్చింది చెప్పడం… నచ్చనిదీ చెప్పడం ఆయన స్టైల్.. ఎవరిని ఎలా ఎత్తుకుంటాడో.. ఎవరి మీద ఎప్పుడు విమర్శిస్తాడో అంచనా వేయడం చాలా కష్టం. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై వర్మ కన్ను పడింది. తన ట్విట్టర్ వేదికగా నరసాపురం ఎంపీపై తనదైన తరహాలో ప్రశంసలు కురిపించారు. […]

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఈయనకు ఏం అనిపిస్తే అది చేస్తుంటారు. తనకు నచ్చింది చెప్పడం… నచ్చనిదీ చెప్పడం ఆయన స్టైల్.. ఎవరిని ఎలా ఎత్తుకుంటాడో.. ఎవరి మీద ఎప్పుడు విమర్శిస్తాడో అంచనా వేయడం చాలా కష్టం. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై వర్మ కన్ను పడింది. తన ట్విట్టర్ వేదికగా నరసాపురం ఎంపీపై తనదైన తరహాలో ప్రశంసలు కురిపించారు.
ఎంపీ రాఘు రామ కృష్ణం రాజుపై తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ…” నాకు రాజు (కుల) ఫీలింగ్ లేదు, కానీ నాకు ఖచ్చితంగా రఘు రామ కృష్ణం రాజు ఫీలింగ్ ఉంది, ఎందుకంటే అతను ఆయన సత్యమనే సింహం లాంటి వాడు, పులి లాంటి ధైర్యవంతుడు. అందుకే ఆయన హీరో…సింహం ఒక్కటే సింగిల్. అంటూ ముగించారు వర్మ. తాజాగా వర్మ చేసిన ట్వీట్ పై ట్రోలింగ్ మొదలైంది.
I don’t have Raju(caste) feeling but I definitely have Raghu Rama Krishna Raju feeling,because he’s a lion of truth and a tiger of dare and that’s why he is a HERO ..Simham okkate Single
— Ram Gopal Varma (@RGVzoomin) June 30, 2020
వైసీపీ పార్టీ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు పంపిస్తే లాజిక్‌లు లాగుతూ.. పార్టీకే షోకాజ్ ఇచ్చిన విషయం తెలిసిందే..