“నా లైఫ్ గురించి వదిలేయండి.. మీ జీవితాలు చక్క దిద్దుకోండి”

తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ వనితా విజయ్ కుమార్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రేమించి మూడోసారి పెళ్లి చేసుకొన్న పీటర్ పాల్‌ను వదిలేయడంతో ఆమెపై అందరి ఫోకస్ పడింది.

నా లైఫ్ గురించి వదిలేయండి.. మీ జీవితాలు చక్క దిద్దుకోండి
Ram Naramaneni

|

Oct 31, 2020 | 9:17 PM

తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ వనితా విజయ్ కుమార్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రేమించి మూడోసారి పెళ్లి చేసుకొన్న పీటర్ పాల్‌ను వదిలేయడంతో ఆమెపై అందరి ఫోకస్ పడింది. అయితే ఇటీవల కాలంలో వనితా విజయ్ కుమార్‌ను ఉద్దేశించి కొందరు టార్గెట్ చేయడంపై ఆమె మండిపడ్డారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్లు ఇస్తూ ట్వీట్లతో ఎదురుదాడి చేశారు.  జీవితంలో తమకు నచ్చినట్టు జీవించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని… ఒకరు ఎలా బ్రతకాలన్నది వారి ఇష్టప్రకారమే ఉండాలి కానీ మరొకరి సలహాలు, సూచనల ప్రకారం కాదు అని రాసుకొచ్చారు. ఒకరి జీవితం గురించి మాట్లాడే ముందు మీ జీవితాలను సరిదిద్దుకొండి అంటూ తనపై విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు.

“నేను చాలా ధైర్యవంతురాలిని. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటా. అందుకు చాలా మంది ప్రేమ, దీవెనలు నాపై ఉన్నాయి. వాటితోనే నేను హ్యాపీగా ఉన్నాను. నాపై ప్రేమను కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. సంతోషం, విషాదాలను పంచుకొంటా నన్ను నన్నుగా ప్రేమించే వారికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. నా లైఫులో చోటుచేసుకొనే పరిణామాలను వారికి అప్‌డేట్ చేస్తుంటాను. నా జీవితానికి సంబంధించిన సంతోషకరమైన క్షణాలను, విషాదాలను వారితో పంచుకొంటాను”  అని వనితా విజయ్ కుమార్ తన ట్వీట్‌లో తెలిపారు.

ఇక తన జీవితంపై గాసిప్స్ ప్రచారం చేస్తూ, ఊహగానాలతో బతికే వారిని వనితా విజయ్ కుమార్ హెచ్చరించారు.  ‘మీ లిమిట్స్‌లో మీరు ఉండాలి. నా లైఫ్‌కు సంబంధం లేని, అవాస్తవ విషయాలను డబ్బు తీసుకొని ప్రచారం చేయకండి. అసత్య వార్తలను మీడియాలో సర్కులేేట్ చేయకండి’ అంటూ వనితా విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :

Bheem For Ramaraju : యూట్యూబ్​లో సరికొత్త రికార్డు

బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘నెపోటిజం’ లొల్లి..సల్మాన్ సీరియస్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu