AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న నటి కూతురు.. ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న నటిగా వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్. తెలుగు, తమిళ్ భాషల్లో విజయ్ కుమార్ సినిమాల్లో నటించారు. ఆమె చేసిన కామెంట్స్, పెళ్లిల్ల గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా సీనియర్ నరేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నటించింది వనిత విజయ్ కుమార్. నాలుగో భర్తతో కూడా విడిపోయింది వనిత విజయ్ కుమార్.

Tollywood: ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న నటి కూతురు.. ఎవరో గుర్తుపట్టారా..?
Jovika
Rajeev Rayala
|

Updated on: Aug 28, 2023 | 8:05 AM

Share

ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నట వారసులు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఓ నటి కూతురు కూడా ఇండస్ట్రీలోకి  రానున్నారని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న నటిగా వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్. తెలుగు, తమిళ్ భాషల్లో విజయ్ కుమార్ సినిమాల్లో నటించారు. ఆమె చేసిన కామెంట్స్, పెళ్లిల్ల గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా సీనియర్ నరేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నటించింది వనిత విజయ్ కుమార్. నాలుగో భర్తతో కూడా విడిపోయింది వనిత విజయ్ కుమార్. ఇక త్వరలోనే వనిత విజయ్ కుమార్ కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తుంది.

వనితా విజయకుమార్‌ తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరిని సినిమా ఇండస్ట్రీలోకి రానుందని తెలుస్తోంది. వనిత విజయ్ కుమార్ చంద్రలేఖ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత ఆమె తెలుగు, తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది. దేవి సినిమాలో వనిత విజయ్ కుమార్ నటించింది. ఇప్పుడు ఆమె కూతురు ఇండస్ట్రీలోకి వస్తుందని తెలుస్తోంది.

వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీని పై వనిత విజయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కుమార్తె జోవిక ను సినిమాల్లో పరిచయం చేయడం కోసం ఎదురుచూస్తున్నా.. ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను.

అలాగే హీరో కూడా ముఖ్యం.. త్వరలోనే జోవిక సినిమాల్లోకి వస్తుంది అని తెలిపింది వనిత విజయ్ కుమార్. ప్రస్తుతం జోవిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జోవిక విజయ్ కుమార్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.