వీడిన శ్రీవాణి హత్యోదంతం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో యువతి శ్రీవాణి హత్యోదంతం తేటతెల్లమైంది. 24 గంటల్లో కేసు చేధించారు పోలీసులు. వలిభాషగుట్టల్లో నిన్న శ్రీవాణి మృతదేహం లభించింది. ఈ కేసులో..

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో యువతి శ్రీవాణి హత్యోదంతం తేటతెల్లమైంది. 24 గంటల్లో కేసు చేధించారు పోలీసులు. వలిభాషగుట్టల్లో నిన్న శ్రీవాణి మృతదేహం లభించింది. ఈ కేసులో మిరియాల రవిని, చిన్నపాక రవితేజలను నిందితులుగా పోలీసులు గుర్తించారు. కాగా, అదే రోజు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి శివారులో మిరియాల రవి అనుమానాస్పద మృతి చెందడం సంచలనమైంది. దీంతో ఏ2 రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, రవితేజ నిజాలను బయటపెట్టాడు. కేసు వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 18న తన తల్లితో పాటు వలిగొండకు శ్రీవాణి వెళ్లగా, ప్రియుడు మిరియాల రవి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పిలవడంతో వలిభాషగుట్ట దగ్గరకు వెళ్లింది శ్రీవాణి. అయితే, శ్రీవాణిపై అనుమానంతో ఉన్న రవి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. శ్రీవాణిని హత్య చేసేందుకు తన స్నేహితుడు రవితేజను సహాయం కోరాడు. రవిపై నమ్మకంతో వచ్చిన శ్రీవాణిపై వలిభాషగుట్టల్లో అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశాడు రవి. కాగా, రవి హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు సోధించేపనిలో పడ్డారు పోలీసులు.



