కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉంది..

కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉంది..

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ సినిమా‌లు వేగంగా తెరకెక్కుతున్నాయి.

Ravi Kiran

|

Aug 08, 2020 | 4:09 PM

Vaani Kapoor Wants To Play Kalpana Chawla Role: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ సినిమా‌లు వేగంగా తెరకెక్కుతున్నాయి. హీరో, హీరోయిన్లు కూడా ఈ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్‌లో ఆసియా తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యువ హీరోయిన్ వాణీ కపూర్ తన మనసులోని మాటను వెల్లడించింది.

”వ్యోమగామి పాత్రలో తనకు నటించాలని ఉంది. కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వదులుకోనని వాణీ కపూర్ తెలిపింది. నేటితరం మహిళలకు ఆమె ఓ ఆదర్శం. ఆమె బయోపిక్ తీస్తే.. అందులో నాకు నటించే అవకాశం వస్తే గౌరవంగా భావిస్తా” అని పేర్కొంది.

Also Read: ‘అల దుబాయ్’లో డేవిడ్ భాయ్.. పోరుకు సిద్ధం.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu