కరోనా కట్టడిలో.. మోదీ ప్రభుత్వ పనితీరుపై.. ప్రజలు ఏమన్నారంటే..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడిలో మోదీ సర్కారు విజయవంతమైందా? వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు

కరోనా కట్టడిలో.. మోదీ ప్రభుత్వ పనితీరుపై.. ప్రజలు ఏమన్నారంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 08, 2020 | 5:32 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడిలో మోదీ సర్కారు విజయవంతమైందా? వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు సృష్టిస్తున్న చైనాకు దీటుగా జవాబు ఇచ్చిందా? ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజలు సంతోషంగానే ఉన్నారా? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు ఏమిటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? మోదీ కేబినెట్‌లో అత్యుత్తమ మంత్రి ఎవరు? తదితర అంశాల్లో ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఫలితాలు, ప్రజాభిప్రాయానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా కట్టడికోసం.. ప్రధానిగా నరేంద్ర మోదీ పనితీరు ఎలా ఉంది? బాగుంది- 48 శాతం అత్యద్భుతం- 29 శాతం పర్లేదు- 18 శాతం బాగోలేదు- 5 శాతం

కరోనా కట్టడికోసం.. విదేశాలతో పోల్చినపుడు, ప్రధానిగా నరేంద్ర మోదీ పనితీరు ఎలా ఉంది? బాగుంది- 48 శాతం పర్లేదు – 43 శాతం ఏమీ చెప్పలేం – 2 శాతం బాగోలేదు- 7 శాతం

Read More:

ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?

జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్స్..!