ఉత్తమ్ ఓడిపోయి హీరో అయ్యారట.! జగ్గారెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..!

హుజూర్‌నగర్ ‌ ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీని ఆగమాగం చేస్తున్నాయి. ఈ ఫలితాలతో మరోసారి పార్టీలోని విభేదాలు భగ్గుమంటున్నాయి. ఓ వైపు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బాధలో ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై.. అదే పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ పద్మావతి ఓటమితో ఉత్తమ్ కుమార్ రెడ్డి హీరో అయ్యారంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ పద్మావతి గెలిచి ఉంటే రేవంత్ రెడ్డి హీరో అయ్యేవాడని అన్నారు. […]

ఉత్తమ్ ఓడిపోయి హీరో అయ్యారట.! జగ్గారెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..!
Follow us

| Edited By:

Updated on: Oct 28, 2019 | 3:45 PM

హుజూర్‌నగర్ ‌ ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీని ఆగమాగం చేస్తున్నాయి. ఈ ఫలితాలతో మరోసారి పార్టీలోని విభేదాలు భగ్గుమంటున్నాయి. ఓ వైపు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బాధలో ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై.. అదే పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ పద్మావతి ఓటమితో ఉత్తమ్ కుమార్ రెడ్డి హీరో అయ్యారంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ పద్మావతి గెలిచి ఉంటే రేవంత్ రెడ్డి హీరో అయ్యేవాడని అన్నారు. గతంలో సైన్యంలో పనిచేసిన ఉత్తమ్.. చాలా ధైర్యవంతుడని.. ఇప్పుడాయనకు ప్రత్యేకంగా ధైర్యం చెప్పాల్సిన పనిలేదన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు.. పార్టీలో ఉన్న విభేదాలను గుర్తుచేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

యుద్ద విమానంలో దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన వ్యక్తి ఉత్తమ్ అంటూ కొనియాడారు. హుజూర్‌నగర్‌లో ఓడిపోయినంత మాత్రాన ఉత్తమ్‌కు వచ్చిన నష్టం ఏం లేదని.. ఆయన పార్టీ పదవి ఎక్కడికి పోదన్నారు. ఉపఎన్నికలు ఎక్కడ జరిగిన.. ఫలితాలు అధికార పార్టీ వైపే మొగ్గుచూపుతాయని.. గతంలో టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా అధికార పార్టీలే లబ్ది పొందాయని గుర్తుచేశారు. ఉపఎన్నికలు ఎప్పుడు కూడా ఏ పార్టీకి రెఫరెండం కాదని స్పష్టం చేశారు.

మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.