వాహనదారులకు బిగ్ అలర్ట్..! వెంటనే VAHANలో ఈ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఇబ్బందులే!
తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మీ వాహనానికి సంబంధించిన ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాలు, నోటీసులు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో అందుకోవాలంటే వెంటనే 'వాహన్' (VAHAN) పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మీ వాహనానికి సంబంధించిన ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాలు, నోటీసులు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో అందుకోవాలంటే వెంటనే ‘వాహన్’ (VAHAN) పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చాలామంది వాహన యజమానులు వాహనం కొనుగోలు చేసిన తర్వాత తమ సంప్రదింపు వివరాలను మార్చుకున్నప్పటికీ వాటిని వాహన్ డేటాబేస్‌లో అప్‌డేట్ చేయకపోవడంతో కీలక సమాచారం అందకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఈ-చలానాలు, వాహనానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రస్తుతం ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపిస్తున్నారు. అయితే వాహన్ పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ వివరాలు పాతవిగా ఉంటే ఆ సమాచారమంతా యజమానికి చేరకుండా పోయే అవకాశం ఉంది. ఫలితంగా జరిమానాలు పెరగడం, పెండింగ్ చలానాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
వాహన్ పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపిన సమాచారం అధికారికంగా వాహన యజమానికి చేరినట్లుగానే పరిగణిస్తారు. అంటే ప్రభుత్వం లేదా ట్రాఫిక్ శాఖ పంపిన నోటీసులు అందలేదని తర్వాత చెప్పినా అది చెల్లుబాటు కాకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అందుకే ప్రతి వాహన యజమాని తమ కాంటాక్ట్ వివరాలు సరైనవేనా అన్నది వెంటనే పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.
వాహనదారులు తమ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకునేందుకు ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. ఇందుకోసం VAHAN పోర్టల్‌ను సందర్శించి అవసరమైన వివరాలను నమోదు చేయవచ్చు. అలాగే సంబంధిత శాఖ విడుదల చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ అప్‌డేట్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
సమాచారం సకాలంలో అందుకోవడం ద్వారా ట్రాఫిక్ చలానాలు, వాహన రిజిస్ట్రేషన్, బదిలీ, అనుమతులు, ఇతర సేవలకు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జరిమానాలు పెరగకుండా, చట్టపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రతి వాహనదారుడు తమ వివరాలను తాజాకరించుకోవడం అత్యంత అవసరమని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి అలసత్వం వహించకుండా నేడే VAHAN పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకుని అప్రమత్తంగా ఉండండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
