AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thunderstorm: ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి!

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అందనిరీ తెలుసు. కానీ ఆ సమయంలో మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులు మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయని మీకు తెలుసా? అవును మెరుపు మనల్ని నేరుగా తాకకపోయినా.. అది నీరు, వైర్లు, పైపులు, లోహపు వస్తువుల ద్వారా ప్రయాణించి మనల్ని గాయపరచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తు్నారు. మనం ఈ ప్రమాదాల బారీన పడకుండా ఉండాలంటే.. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు మనం చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి అవేంటో ఇక్కడ చూద్దాం.

Anand T
|

Updated on: Jun 16, 2026 | 2:29 PM

Share
తడి వస్తువులను ముట్టుకోవద్దు: ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసేప్పుడు నీరు నేరుగా మెరుపులను ఆకర్షించక పోవచ్చు.. కానీ అది కరెంట్‌ను మాత్రం అది చాలా స్పీడ్‌గా ప్రసరిస్తుంది. అంటే మీ దగ్గర్లో ఎక్కడైనా మెరుపులు, పడిగువు వంటికి పడితే.. వాటి నుంచి ఉద్బవించే విద్యుత్ నీటి ద్వారా ప్రయాణించి మిమ్మల్ని తాకవచ్చు. కాబట్టి తుఫాను సమయంలో స్విమ్మింగ్ పూల్స్, చెరువులలో ఉండటం లేదా తడి వస్తువులను తాకడం చేయొద్దని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరిస్తోంది.

1 / 5
వర్షం సమయంలో ల్యాండ్‌లైన్ ఫోన్‌ల, స్మార్ట్‌ ఫోన్‌ను ప్లగ్‌ఇన్ చేసిన అస్సలు వాడొద్దు. సిడిసి ప్రకారం, మెరుపులు ఫోన్, ఎలక్ట్రికల్ లైన్ల ద్వారా కూడా ప్రయాణిస్తాయి. అలాంటి సందర్భంలో మీరు వాటిని వాడితే  కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు, టోస్టర్లు, ప్లగ్ చేసి ఉన్న ఏ ఎలక్ట్రానిక్ వస్తువుకైనా ఇది వర్తిస్తుంది. కాబట్టి భారీ వర్షాలు, తుఫాన్ హెచ్చరికల సమయంలో ప్లగ్‌ఇన్‌లో ఉన్నవాటి జోలికి వెల్లవద్దు.. వర్షానికి ముందే వాటిని అన్‌ప్లగ్ చేయడం మంచిది.

2 / 5
చాలా మందికి వర్షం తగ్గిన వెంటనే బయటకు వచ్చి వెదర్ ఎంజాయ్ చేసే అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేయడం తప్పు.. సిడిసి ప్రకారం.. వర్షం ఆగిన వెంటనే ప్రమాదం తగ్గిందని కాదు.. మెరుపు కనిపించిన 30 సెకన్ల లోపే మీకు ఉరుము వినిపిస్తే, వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి. అలాగే, వర్షం తగ్గిన తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాతే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలి. ఎందుకంటే తుఫాను దూరంగా వెళ్ళిపోయినట్లు అనిపించినా, మెరుపులు మైళ్ల దూరం నుండి కూడా వచ్చి పడే అవకాశం ఉంది.

3 / 5
కాంక్రీట్ గోడలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనుకోవచ్చు. కానీ తుఫాను సమయంలో వీటికి సమీపంలో నిల్చోవడం, కూల్చోవడం ప్రమాదకరం. ఎందుకంటే కాంక్రీట్ గోడలు, ఫ్లోరింగ్ లోపల ఇనుప రాడ్‌లు ఉంటాయి, ఇవి విద్యుత్‌ను సులభంగా ప్రసరింపజేస్తాయి. కాబట్టి తుఫాను పూర్తిగా తగ్గే వరకు కాంక్రీట్ నిర్మాణాలకు దూరంగా ఉండటం మంచిది.

4 / 5
భారీ వర్షం, ఉరుములు వచ్చేటప్పుడు స్నానం అస్సలూ చేయొద్దు. ఎందుకంటే మెరుపు మీ ఇంటిపై లేదా సమీపంలో పడితే, అది ప్లంబింగ్ పైపుల ద్వారా ప్రయాణించి స్నానం చేస్తున్న వారికి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. స్నానం ఒక్కటే కాదు, చేతులు కడుక్కోవడం, గిన్నెలు కడగడం కూడా ప్రమాదకరమే. ప్రముఖ సైన్స్ షో 'మిత్‌బస్టర్స్ లో చేసిన ఒక ప్రయోగంలో, మెరుపులు వచ్చేటప్పుడు స్నానం చేస్తే షాక్ కొట్టి, నిప్పురవ్వలు ఎగిసిపడే అవకాశం ఉందని రుజువైంది.

5 / 5
Follow Us