AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలుకల బెడదకు చెక్..! చంపకుండానే ఇంటి నుంచి తరిమేసే సూపర్ చిట్కా

ఇంట్లో లేదా వంటగదిలో ఎలుకల సంచారం వల్ల ఆహారం పాడవడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే, మార్కెట్లో దొరికే విషపూరిత మందులు వాడకుండా, వాటిని చంపకుండానే ఇల్లు దాటించే ఒక సులువైన చిట్కా ఉంది. దీనికోసం వంటగదిలోని అతి తక్కువ ఖర్చుతో లభించే పదార్థాలు ఉంటే సరిపోతుంది. దీంతో ఎలుకలు మీ ఇంట్లో ఏ మూలన నక్కినా సరే..బయటకు పరుగులు తీస్తాయి. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళ్దాం..

ఎలుకల బెడదకు చెక్..! చంపకుండానే ఇంటి నుంచి తరిమేసే సూపర్ చిట్కా
How To Get Rid Of RatsImage Credit source: tv9 gujarathi
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2026 | 4:50 PM

Share

ఇల్లు లేదా వంటగది ఎంత శుభ్రంగా ఉన్నా, కొన్నిసార్లు ఎలుకలు చేరి తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తాయి. ఇవి వంటగదిలోని ఆహార పదార్ధాలను పాడు చేయడమే కాకుండా, బట్టలు, సోఫాలు, ముఖ్యమైన కాగితాలను కూడా కొరికేస్తాయి. అంతేకాదు, ఎలుకలు ఎంగిలి చేసిన ఆహారాన్ని తినడం వల్ల మానవ ఆరోగ్యానికి ఎంతో ముప్పు వాటిల్లుతుంది. అయితే, చాలామంది ఎలుకలను చంపడానికి ఇష్టపడరు. మరి వాటిని చంపకుండా, కేవలం ఇంటి నుండి ఎల్లప్పటికీ దూరంగా ఎలా తరిమికొట్టాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలుకలను తరిమికొట్టే ఒక అద్భుతమైన దేశీయ చిట్కా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం మార్కెట్ నుండి ఎటువంటి ఖరీదైన మందులు కొనాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి – 2 చెంచాలు

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా – 1 చెంచా

హార్పిక్ (Harpic) – తగినంత

తయారుచేసే విధానం:

మొదట ఆహార పదార్ధాలకు ఉపయోగించని ఒక పాత ప్లాస్టిక్ డబ్బాను తీసుకోండి. అందులో రెండు స్పూన్ల గోధుమ పిండి, ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమానికి కొద్దిగా హార్పిక్ జోడించండి. హార్పిక్ అనేది కెమికల్ కాబట్టి చేతులకు ప్లాస్టిక్ కవర్ లేదా గ్లౌజెస్ ధరించి మాత్రమే పిండిని గట్టిగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కూడా వాడుకోవచ్చు. పిండి బాగా కలిసిపోయిన తర్వాత, దానిని చిన్న చిన్న గోళీల (ఉండల) రూపంలో తయారుచేసుకోవాలి.

ఎలా ఉపయోగించాలి?:

రాత్రి సమయంలో వంటగది పనులన్నీ పూర్తయి, గ్యాస్ స్టవ్ ఆపివేసిన తర్వాత ఈ గోళీలను ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో ఉంచాలి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల, ఫ్రిజ్ వెనుక లేదా కింద, వంటగదిలోని చీకటి మూలల్లో వీటిని పెట్టాలి. గోధుమ పిండి వాసనకు ఆకర్షితులై ఎలుకలు వీటిని తింటాయి. కానీ, బేకింగ్ సోడా, హార్పిక్ కలయిక వల్ల వాటి కడుపులో తీవ్రమైన మంట, అసౌకర్యం మొదలవుతాయి. ఈ అసహనంతో అవి స్వచ్ఛమైన గాలి కోసం వెతుకుతూ వెంటనే మీ ఇల్లు వదిలి బయటకు పరుగులు తీస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఈ గోళీలను పెట్టేటప్పుడు చుట్టుపక్కల ఎలాంటి ఇతర ఆహార పదార్ధాలు విడిగా ఉంచకూడదు. అప్పుడే ఆకలితో ఉన్న ఎలుకలు నేరుగా ఈ పిండి ముద్దలను తింటాయి. అలాగే, ఇందులో హార్పిక్, బేకింగ్ సోడా వాడినందున, ఇంట్లోని చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు (Pets) అందకుండా, కేవలం ఎలుకలు మాత్రమే వెళ్లే సురక్షితమైన మూలల్లో వీటిని ఉంచాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?