గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం, వరిగాని గ్రామ చెరువులో చేపలు సామూహికంగా మృతి చెందుతున్నాయి. ఐదు రోజుల క్రితం చెరువులోకి కొత్త నీరు చేరినప్పటి నుంచి ఈ ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కలుషిత నీరు చేరడం లేదా ఆక్సిజన్ లోపం వంటి కారణాలపై అధికారులు విచారణ చేపట్టనున్నారు.