వెల్లుల్లి ఆహారానికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ దీని విషయంలో ఇబ్బంది ఏమైనా ఉంది అంటే దానిని పొట్టు తీయడమే.. కాబట్టి దీన్ని సింపుల్‌గా ఎలా తీయాలో తెలుసుకుందాం.
వొలవడం ఎలా?
వెల్లుల్లి రెబ్బలను ఒక గిన్నెలో వేసి, కొన్ని వేడి నీళ్లు పోసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తర్వాత చేత్తో కొద్దిగా నొక్కితే పొట్టు సులభంగా ఊడిపోతుంది
వేడి నీటి పద్ధతి
వెల్లుల్లి రెబ్బలను కటింగ్ బోర్డ్‌పై పెట్టి కత్తిని దానిపై వెడల్పుగా పెట్టి, చేతితో కత్తిపై మెల్లగా నొక్కాలి. తర్వాత పొట్టు ఈజీగా వస్తుంది
కటింగ్ బోర్డ్ పద్ధతి
వెల్లుల్లి రెబ్బలను ఒక ప్లేట్‌లో పెట్టి కేవలం 15 నుండి 20 సెకన్ల పాటు మైక్రోవేవ్ చేయాలి. ఓవెన్ నుండి తీసి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో తాకితే పొట్టు సులభంగా వచ్చేస్తుంది.
మైక్రోవేవ్ పద్ధతి
వెల్లుల్లి రెబ్బలను ఒక గంట పాటు మంచి ఎండలో పెట్టి తర్వాత చేత్తో నలిపితే పొట్టు ఈజీగా రాలిపోతుంది.
ఎండలో పెట్టే పద్ధతి
పైన పేర్కొన్న చిట్కాలలో మీకు వీలైన, అనుకూలమైన పద్ధతిని ఎంచుకుని ప్రయత్నించవచ్చు.
మీకు నచ్చిన పద్ధతి
అయితే మీరు వీటిని యూజ్ చేసేప్పుడు చేయి కాలకుండా, కత్తిని ఉపయోగించేటప్పుడు గాయం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
జాగ్రత్తలు
వెల్లుల్లిని కట్ చేయడానికి లేదా దంచడానికి ముందు చేతులకు కొద్దిగా కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. ఇది ఘాటు వాసన రాకుండా చేస్తుంది.