పోరాట యోధుల ఫలితమే తెలంగాణ
ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాట యోధుల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థలు అణచివేతకు గురయ్యాయని విమర్శించారు. ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైందో..వాటిని నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో ఇవాళ ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ.. తరతరాల వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. […]
ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాట యోధుల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థలు అణచివేతకు గురయ్యాయని విమర్శించారు. ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైందో..వాటిని నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో ఇవాళ ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ.. తరతరాల వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. ప్రస్తుత పాలకుల వల్ల రాష్ట్రం అప్పులపాలైందన్నారు. 60 వేల కోట్ల నుంచి లక్షా 85 వేల కోట్లకు అప్పులను పెంచిన ఘనత టీఆర్‌ఎస్ సర్కార్‌దేనన్నారు. విభజన చట్టంలో పెట్టిన ఏ హామీని కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్న ఉత్తమ్.. రాష్ట్రంలో నిరుద్యోగ యువత నైరాశ్యంలో ఉందన్నారు. ఏక కాలంలో రైతుల రుణమాఫీ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.