కశ్మీర్ టూర్‌లో.. ప్రకాశ్ రాజ్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కుటుంబంతో కలిసి కాశ్మీర్‌లో పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. తాజాగా ప్రకాశ్ రాజ్ షూటింగ్‌లతో బిజీ అయ్యారు. ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం ఆయన కాశ్మీర్ వెళ్లారు. మరోవైపు.. అక్కడే సతీమణి పొనీ వర్మ, కుమారుడు వేదాంత్‌తో కలిసి సమయం గడుపుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు ప్రకాశ్ రాజ్. కాశ్మీర్‌లో ఉన్నాం.. నా […]
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కుటుంబంతో కలిసి కాశ్మీర్‌లో పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. తాజాగా ప్రకాశ్ రాజ్ షూటింగ్‌లతో బిజీ అయ్యారు. ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం ఆయన కాశ్మీర్ వెళ్లారు. మరోవైపు.. అక్కడే సతీమణి పొనీ వర్మ, కుమారుడు వేదాంత్‌తో కలిసి సమయం గడుపుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు ప్రకాశ్ రాజ్. కాశ్మీర్‌లో ఉన్నాం.. నా అందమైన దేశం.. నా అద్భుతమైన కుటుంబంతో సమయం గడుపుతున్నామని ట్వీట్ చేశారు.
In Kashmir… my beautiful country…with my wonderful family .. shooting and vacationing after a hectic summer .. bliss pic.twitter.com/EaUaCDWPSv
— Prakash Raj (@prakashraaj) June 1, 2019