సుజనా చౌదరి కార్యాలయాల్లో సీబీఐ సోదాలు
కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరి ఇల్లు, ఆఫీసులో సీబీఐ సోదాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని సుజనా ఇల్లు, ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను సీజ్ చేశారు సీబీఐ అధికారులు. కర్నాటకలో బెస్ట్ అండ్ క్రాంప్టన్ పేరుతో వ్యాపారం నిర్వహించారు సుజనా. ఇప్పటికే నలుగురు సుజనా గ్రూప్ డైరక్టర్లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్టలోని నాగార్జునహిల్స్‌లో ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆఫీస్‌ను ఇప్పటికే సీజ్ చేశారు అధికారులు. […]
కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరి ఇల్లు, ఆఫీసులో సీబీఐ సోదాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని సుజనా ఇల్లు, ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను సీజ్ చేశారు సీబీఐ అధికారులు. కర్నాటకలో బెస్ట్ అండ్ క్రాంప్టన్ పేరుతో వ్యాపారం నిర్వహించారు సుజనా. ఇప్పటికే నలుగురు సుజనా గ్రూప్ డైరక్టర్లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
పంజాగుట్టలోని నాగార్జునహిల్స్‌లో ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆఫీస్‌ను ఇప్పటికే సీజ్ చేశారు అధికారులు. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన పత్రాలతో పాటు బ్యాంకులు ఇచ్చిన ఇన్‌వాయిస్‌లను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులో సుజనాపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ ఈ సోదాలు చేస్తోంది. గతంలో సుజనాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. సుజనా నివాసంతో పాటు హైదరాబాద్‌లో మూడు చోట్ల సోదాలు నిర్వహించారు. కర్ణాటకలో బెస్ట్ అండ్ కాంప్టన్ పేరుతో చేసిన వ్యాపారం కోసం రుణాలు తీసుకుని.. అక్రమంగా సుజనా చౌదరి కంపెనీకి బదిలీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది.
ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకుల నుంచి 360 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టినట్టు సుజనా గ్రూప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. శ్రీనగర్‌లోని సుజనా నివాసంతో పాటు నాగార్జునహిల్స్, జూబ్లీహిల్స్‌లోని కార్యాలయాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.