AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్‌కు చంద్రబాబు దూరం కానున్నారా..!

లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక అటు ఏపీలో తామే మళ్ళీ అధికారంలోకి వస్తాం అనుకున్న టీడీపీకి అధికారం దక్కకపోవడం.. కేంద్రంలో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం చంద్రబాబు‌కు కోలుకోలేని షాక్‌ను ఇచ్చాయని చెప్పాలి. ప్రస్తుతం అటు బీజేపీ, ఇటు వైఎస్ఆర్సీపీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు.. ఎన్నికల ముందు స్నేహం చేసిన కాంగ్రెస్‌కు కూడా దూరం కావాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు జోరుగా […]

కాంగ్రెస్‌కు చంద్రబాబు దూరం కానున్నారా..!
Ravi Kiran
|

Updated on: Jun 02, 2019 | 12:04 PM

Share

లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక అటు ఏపీలో తామే మళ్ళీ అధికారంలోకి వస్తాం అనుకున్న టీడీపీకి అధికారం దక్కకపోవడం.. కేంద్రంలో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం చంద్రబాబు‌కు కోలుకోలేని షాక్‌ను ఇచ్చాయని చెప్పాలి. ప్రస్తుతం అటు బీజేపీ, ఇటు వైఎస్ఆర్సీపీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు.. ఎన్నికల ముందు స్నేహం చేసిన కాంగ్రెస్‌కు కూడా దూరం కావాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌తో చేతులు కలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పలుమార్లు కలిసిన చంద్రబాబు.. మిత్రపక్షాలన్నింటినీ ఏకం చేసి కాంగ్రెస్ సారధ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ ఆలోచించారు. అయితే ఆయన అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏమాత్రం పుంజుకోకపోగా.. బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకుని భారీ మెజార్టీతో మరోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది.

మరోవైపు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పాత మిత్రులంతా.. ఆ పార్టీతో సఖ్యత కొనసాగిస్తుంటే.. చంద్రబాబు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేసినా.. ఈ అంశంపై చంద్రబాబు, టీడీపీ ఏమాత్రం స్పందించలేదు. దీనితో చంద్రబాబు కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజముందో తెలియాలంటే ఆ పార్టీ నేతలే చెప్పాలి.