Health Tips: దానిమ్మతో అందం పెంచుకోండిలా.. రెట్టింపు చర్మ సౌందర్యం కోసం సింపుల్‌ ప్యాక్స్‌..

|

Feb 23, 2024 | 4:04 PM

కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, చర్మం స్థితిస్థాపకత, దృఢత్వాన్ని మెరుగుపరచడానికి, ముడతలను నివారించడానికి దానిమ్మ ఫేస్ ప్యాక్‌లను ముఖంపై ప్రయత్నించవచ్చు. దానిమ్మ మొటిమలు, నల్ల మచ్చలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

Health Tips: దానిమ్మతో అందం పెంచుకోండిలా.. రెట్టింపు చర్మ సౌందర్యం కోసం సింపుల్‌ ప్యాక్స్‌..
Pomegranate Face Packs
Follow us on

దానిమ్మ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పండు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం, చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. విటమిన్లు ఎ, సి, కె, బి, ఇ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, అనేక ఇతర పోషకాలను కలిగి ఉన్న దానిమ్మ అద్భుతమైన పండు. దానిమ్మ తినడానికి మాత్రమే కాదు ముఖానికి అప్లై చేయడానికి కూడా మంచిది. దానిమ్మ పండులో ఉన్న గుణాలు దానిమ్మ తొక్కలో కూడా ఉంటాయి. దానిమ్మ చర్మం కణాల పెరుగుదలకు, చర్మంలో కొల్లాజెన్ విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.

కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, చర్మం స్థితిస్థాపకత, దృఢత్వాన్ని మెరుగుపరచడానికి, ముడతలను నివారించడానికి దానిమ్మ ఫేస్ ప్యాక్‌లను ముఖంపై ప్రయత్నించవచ్చు. దానిమ్మ మొటిమలు, నల్ల మచ్చలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

* దానిమ్మపండుతో కొన్ని ఫేస్ ప్యాక్‌లను తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

– రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ రసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముడతలు రాకుండా, మచ్చలను తొలగించి, ముఖం కాంతివంతంగా మారేలా చేస్తుంది.

– రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ రసంలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే అద్భుత ఫలితం ఉంటుంది.

– రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ రసంలో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

– దానిమ్మ తొక్కలను పొడి చేసి మెత్తగా రుబ్బాలి. తర్వాత ఒక టీస్పూన్ దానిమ్మ తొక్క పొడి, ఒక టీస్పూన్ నారింజ తొక్క, రెండు టీస్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది ముఖంపై ముడతలు, నల్ల మచ్చలు, మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది.

– మూడు టేబుల్ స్పూన్ల దానిమ్మ తొక్క పొడిని ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ ముఖంలోని నల్లదనాన్ని మార్చడానికి సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..