AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెచ్1బీ వీసాలపై ట్రంప్ నిర్ణయానికి బ్రేక్..

అమెరికా అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ దేశ జిల్లా కోర్టు భారీ షాక్ ఇచ్చింది.

హెచ్1బీ  వీసాలపై ట్రంప్ నిర్ణయానికి బ్రేక్..
Balaraju Goud
|

Updated on: Oct 02, 2020 | 12:36 PM

Share

అమెరికా అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ దేశ జిల్లా కోర్టు భారీ షాక్ ఇచ్చింది.. హెచ్1బీ వీసాలతో సహా వర్కింగ్‌ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుబట్టింది. ఈ ఏడాది జూన్‌లో అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన హెచ్1బీ వీసా నిషేధంపై నిలువరిస్తూ ఫెడరల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్ గురువారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాదు, ట్రంప్ తన రాజ్యాంగ అధికారాన్ని మించిపోయారని న్యాయమూర్తి జెఫ్రీ వైట్ వ్యాఖ్యానించారు. దీంతో హెచ్1 బీ వీసా ఆంక్షలు తక్షణమే నిలిచిపోతాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ ప్రతినిధులు తెలిపారు.

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు పలు వీసాలను నిలిపివేస్తున్నామని, అమెరికన్లకే ఉద్యోగాలు అన్నదే తమ నినాదమంటూ ట్రంప్ గత జూన్ 22 న ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌1బీ, హెచ్‌ 4, హెచ్ 2బీ, జే, ఎల్ వీసా సహా ఇతర విదేశీ వీసాలను జారీపై తాత్కాలిక నిషేధం విధించారు ట్రంప్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ , టెక్ నెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు ట్రంప్ ఆదేశాలను సవాల్ చేస్తూ కాలిఫోర్నియా జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తి జెఫ్రీ వైట్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా దెబ్బతో కుదేలైన తర్వాత ఆర్థిక పునరుద్ధరణ, వృద్ధి ఆవిష్కరణలు అవసరమైన సమయంలో తమకు అడ్డంకులు కల్పించారని వాదించాయి. కీలకమైన కష్టసాధ్యమైన ఉద్యోగాలను నిరోధిస్తున్న వీసా పరిమితులపై ఈ తీర్పు ఊరటనిస్తుందని పేర్కొన్నారు.

Follow Us
అక్షయ తృతీయ రోజు ఇలాంటి కలలు వస్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే!
అక్షయ తృతీయ రోజు ఇలాంటి కలలు వస్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే!
ఇంటర్ 2nd ఇయర్‌ విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు ఓకే
ఇంటర్ 2nd ఇయర్‌ విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు ఓకే
ఆదివారం అక్షయ తృతీయ.. మీ ఇంట్లో ధన వర్షం కురవాలంటే ఇలా చేయండి..
ఆదివారం అక్షయ తృతీయ.. మీ ఇంట్లో ధన వర్షం కురవాలంటే ఇలా చేయండి..
SRH vs CSK IPL 2026 Live Score: ఉప్పల్‌లో హోరాహోరీ పోరు పక్కా..
SRH vs CSK IPL 2026 Live Score: ఉప్పల్‌లో హోరాహోరీ పోరు పక్కా..
జనాభా లెక్కల పేరుతో ఇంటికి వస్తున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే..
జనాభా లెక్కల పేరుతో ఇంటికి వస్తున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే..
'గ్రీన్ జెర్సీ'లో కింగ్ కోహ్లీ.. 4 ఏళ్ల చెత్త చరిత్ర రిపీట్
'గ్రీన్ జెర్సీ'లో కింగ్ కోహ్లీ.. 4 ఏళ్ల చెత్త చరిత్ర రిపీట్
విన్నా కొద్దీ వినాలనిపించే ఫోక్ సాంగ్
విన్నా కొద్దీ వినాలనిపించే ఫోక్ సాంగ్
ఈ మూడు రాశుల వారికి దరిద్ర ఘడియలు ఆరంభం.. రాబోయే నెలలో జాగ్రత్త
ఈ మూడు రాశుల వారికి దరిద్ర ఘడియలు ఆరంభం.. రాబోయే నెలలో జాగ్రత్త
తోటి ఆటగాడిని అవమానించిన కోహ్లీ ఫ్రెండ్.. కట్‌చేస్తే..
తోటి ఆటగాడిని అవమానించిన కోహ్లీ ఫ్రెండ్.. కట్‌చేస్తే..
కోట్లు కురిపిస్తున్న చిట్టి చీమలు.. వీటితో ఏం చేస్తారో తెలుసా
కోట్లు కురిపిస్తున్న చిట్టి చీమలు.. వీటితో ఏం చేస్తారో తెలుసా