5

కోవిడ్-19 పై రష్యా, చైనా, ఇరాన్ తప్పుడు ప్రచారం.. అమెరికా ఫైర్

కరోనాపై రష్యా, చైనా . ఇరాన్ దేశాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమెరికా నిప్పులు కక్కింది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నీరు గార్చేందుకు ఈ మూడు దేశాలు

కోవిడ్-19 పై రష్యా, చైనా, ఇరాన్ తప్పుడు ప్రచారం.. అమెరికా ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 21, 2020 | 4:23 PM

కరోనాపై రష్యా, చైనా . ఇరాన్ దేశాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమెరికా నిప్పులు కక్కింది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నీరు గార్చేందుకు ఈ మూడు దేశాలు యత్నిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించి తీరాల్సిందేనని అన్నారు. అమెరికన్లు విశ్వసనీయ వర్గాలనుంచి అందే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన కోరారు. ఒక సమాచారం తప్పుడుదని తెలిసినప్పటికీ కావాలనే దాన్ని అదేపనిగా సృష్టించడానికి ఈ దేశాలు ఓ ‘బ్యాడ్ యాక్టర్’ (విలన్) లా వ్యవహరిస్తున్నాయని, ఈ విషయాన్ని అమెరికన్లు గ్రహించాలని ఆయన అన్నారు. కొంత తప్పుడు సమాచారం ట్విటర్ ద్వారా, మరికొంత కొన్ని ప్రపంచ దేశాల ద్వారా, ఇంకొంత…  కొంతమంది వ్యక్తుల ద్వారా వస్తోంది. కానీ ఇలా  వివిధ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని మీకు మీరే విశ్లేషించుకొండి.. అసలు కరోనా వైరస్ అమెరికన్ ఆర్మీ నుంచి  వచ్చిందని ఈ దేశాలు దుష్ప్రచారం చేస్తున్నాయి అని మైక్ పాంపియో దుయ్యబట్టారు.అయితే..   అధ్యక్షుడు  ట్రంప్ ఇటీవల ఈ వైరస్ ను వూహన్ వైరస్ అని, ఫారిన్ వైరస్ అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఏమైనా.. కరోనాను ఎదుర్కోవడం కఠినమైన పనే అని మైక్ అంగీకరించారు. అయితే అమెరికన్లంతా ఐక్యంగా ఉన్నారని, మన దౌత్య బృందాలు 24 గంటలూ వారిని రక్షించేందుకు యత్నిస్తున్నాయని ఆయన చెప్పారు.

ఇలా ఉండగా…  ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 కారణంగా మరణించినవారి సంఖ్య 11,397 కి పెరిగింది. 160 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య కూడా 2 లక్షల 75 వేలకు పైగా పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.

అబధ్ధాలు చెప్పడం ఆపండి’

కరోనాపై తమ దేశం  (చైనా)కూడా తప్పుడు సమాచారం ఇస్తోందంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేసిన ఆరోపణలను చైనా ఖండించింది. యుఎస్ పై ఎదురుదాడికి దిగుతూ.. ప్రజల దృష్టిని మళ్లించడానికే మాపై బురద జల్లుతున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మహిళా అధికార ప్రతినిధి హు హూఛునింగ్ విమర్శించారు. వూహాన్ నుంచి వందలాది ప్రజలు వెళ్లిపోతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్ఛుతూ.. ఈ విధమైన అసత్యాలను ప్రచారం చేయొద్దని కోరారు. వేలాది కరోనా కేసులు వ్యాపించకుండా చైనా నివారించగలిగిందని  ప్రపంచ ఆరోగ్య  సంస్థ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది.