పోలీసుల ఆపరేషన్ సక్సెస్…48 గంటల్లో 150 మంది తబ్లీగ్ జమాతీలు అరెస్ట్..
యూపీ పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. 48 గంటలపాటు తీవ్రంగా శ్రమించి దాదాపు 150 మంది తబ్లీగ్ జమాత్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు వెళ్లివచ్చినవారి నుంచి కరోనా వ్యాప్తి చెంది..దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. యూపీ నుంచి 500 మందికిపైగా మర్కజ్ ప్రార్థనలకు హాజరయ్యారు. అయితే ఢిల్లీ ప్రార్థనల వెళ్లినవారు కొందరు బయటకు చెప్పకుండా దాక్కుని ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు గాలింపు […]

యూపీ పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. 48 గంటలపాటు తీవ్రంగా శ్రమించి దాదాపు 150 మంది తబ్లీగ్ జమాత్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు వెళ్లివచ్చినవారి నుంచి కరోనా వ్యాప్తి చెంది..దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. యూపీ నుంచి 500 మందికిపైగా మర్కజ్ ప్రార్థనలకు హాజరయ్యారు. అయితే ఢిల్లీ ప్రార్థనల వెళ్లినవారు కొందరు బయటకు చెప్పకుండా దాక్కుని ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరి ఆచూకీ చెప్పినవారికి రూ.10,000 నజరానా కూడా ఇస్తామని అనౌన్స్ చేశారు. మంగళవారం స్టార్ట్ అయిన ఈ ఆఫరేషన్.. 48 గంటలపాటు సాగింది. గురువారం నాటికి 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో జమాత్ తబ్లీగ్‌కు హాజరైన 341 మంది విదేశీయులు సహా 3,204 మందిని అదుపులోకి తీసుకున్నట్టయ్యింది.




