హిందుస్థాన్ వ్యతిరేకులతో కేసీఆర్ దోస్తీ.. గ్రేటర్ ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు శనివారం హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూకట్ పల్లి సభ అనంతరం పాతబస్తీలోని లాల్ దర్వాజాలో..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు శనివారం హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూకట్ పల్లి సభ అనంతరం పాతబస్తీలోని లాల్ దర్వాజాలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. గత ఆరేళ్లలో తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. హిందుస్థాన్ అనని వాళ్లతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని యోగి విమర్శించారు. కేసీఆర్ కు పేదలపై ప్రేమలేదన్నారు. కరోనాను మోదీ సమర్థవంతంగా నియంత్రించారని చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పారు. అలహాబాద్.. అయోధ్యగా మారినప్పుడు హైదరాబాద్.. భాగ్యనగరంగా మారటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని యోగి చెప్పుకొచ్చారు.