ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన 32 మంది కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపింది. బండాలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో కుటుంబసభ్యులందరికీ కరోనా పాజిటివ్ గా తేలిందని వైద్య అధికారులు తెలిపారు.

ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా పాజిటివ్
Follow us
Balu

|

Updated on: Sep 01, 2020 | 6:41 PM

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన 32 మంది కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపింది. బండాలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో కుటుంబసభ్యులందరికీ కరోనా పాజిటివ్ గా తేలిందని వైద్య అధికారులు తెలిపారు. వీరితో పాటు, అదే ప్రాంతానికి చెందిన మరో 44 మందికి కూడా కరోనా సోకింది. దీంతో బండా జిల్లాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 807కు చేరిందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్ డీ శర్మ ప్రకటించారు. మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే 36 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 65 వేలమంది చనిపోయారు. యూపీ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,30,414 కు చేరగా, 3,486 మంది మరణించారు.