ఉగ్రదాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి

ఐరాస: పుల్వామా ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా విభాగం (యూఎన్‌ఎస్సీ) తీవ్రంగా ఖండించింది. దాడిని క్రూరమైన, పిరికిపందల చర్యగా అభివర్ణించింది. భారత్‌ వాదనకు మద్దతుగా.. పాకిస్థాన్‌ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ ఈ దాడికి బాధ్యత వహించినట్లు కూడా తీర్మానంలో పేర్కొనడం గమనార్హం. వెంటనే దోషుల్ని చట్టం ముందుకు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలంది. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి అన్ని దేశాలూ భారత ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాని […]

ఉగ్రదాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:49 PM

ఐరాస: పుల్వామా ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా విభాగం (యూఎన్‌ఎస్సీ) తీవ్రంగా ఖండించింది. దాడిని క్రూరమైన, పిరికిపందల చర్యగా అభివర్ణించింది. భారత్‌ వాదనకు మద్దతుగా.. పాకిస్థాన్‌ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ ఈ దాడికి బాధ్యత వహించినట్లు కూడా తీర్మానంలో పేర్కొనడం గమనార్హం. వెంటనే దోషుల్ని చట్టం ముందుకు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలంది. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి అన్ని దేశాలూ భారత ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాని నిర్మూలనకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చింది.

భారత్‌ ప్రతిపాదించిన తీర్మాన ప్రకటనపై భద్రతా మండలిలో సుదీర్ఘ చర్చ జరిగింది. ‘పాకిస్థాన్‌ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ’ అన్న ప్రకటనకు చైనా అంగీకరించట్లు సమాచారం. అలాగే ‘భారత్‌కు చెందిన కశ్మీర్‌’ అని కాకుండా ‘భారత్ అధీనంలోని కశ్మీర్‌’ అని ప్రకటనలో పేర్కొనాలని కూడా చైనా సూచించనట్లు సమాచారం. అయినప్పటికీ చైనా అభ్యంతరాలను తోసిపుచ్చి భారత్‌ ప్రతిపాదించిన ప్రకటనకే మండలి మొగ్గుచూపడం గమనార్హం.

జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ స్థాపకుడు మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి చైనా మోకాలడ్డుతున్న విషయం తెలిసిందే. త్వరలో మరోసారి అజార్‌ అంశాన్నిమండలిలో ఫ్రాన్స్‌ ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఉగ్రదాడిని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ తీవ్రంగా ఖండించడమే గాక ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించాలని కోరిన విషయం తెలిసిందే.