AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్వారంటైన్ కు కొన్ని మినహాయింపులు ఉన్నాయంటున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ..!

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తుంటే.. కొవిడ్-19 నిబంధనలను ప్రతిఒక్కరూ.. ఖచ్చితంగా పాటించాలంటూ కేంద్రం చెబుతోంది. అయితే నేను మంత్రిని నాకు రూల్స్ ఏంటీ అంటూ దులుపేసుకుంటూ పోయాడు కేంద్రమంత్రి సదానందగౌడ్. కేంద్ర మంత్రి స‌దానంద గౌడ సోమవారం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో వ‌చ్చారు. అయితే ఆయ‌న హోట‌ల్ క్వారెంటైన్‌కు వెళ్ల‌లేదు. క్వారెంటైన్ నిబంధ‌న‌లు అంద‌రికీ ఒక్క‌టే అని, కానీ కొంత మందికి మిన‌హాయింపులు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఓ మంత్రి, ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని […]

క్వారంటైన్ కు కొన్ని మినహాయింపులు ఉన్నాయంటున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ..!
Balaraju Goud
|

Updated on: May 25, 2020 | 4:55 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తుంటే.. కొవిడ్-19 నిబంధనలను ప్రతిఒక్కరూ.. ఖచ్చితంగా పాటించాలంటూ కేంద్రం చెబుతోంది. అయితే నేను మంత్రిని నాకు రూల్స్ ఏంటీ అంటూ దులుపేసుకుంటూ పోయాడు కేంద్రమంత్రి సదానందగౌడ్. కేంద్ర మంత్రి స‌దానంద గౌడ సోమవారం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో వ‌చ్చారు. అయితే ఆయ‌న హోట‌ల్ క్వారెంటైన్‌కు వెళ్ల‌లేదు. క్వారెంటైన్ నిబంధ‌న‌లు అంద‌రికీ ఒక్క‌టే అని, కానీ కొంత మందికి మిన‌హాయింపులు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఓ మంత్రి, ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని ఇందుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయన్నారు మంత్రి సదానందగౌడ. పైగా త‌న ఫోన్‌లో ఆరోగ్య‌సేతు యాప్ ఉన్న‌ట్లు తెలిపారు. ఫార్మ‌సీ శాఖ‌కు తానే మంత్రినని, ఒక‌వేళ మందుల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌కుంటే, కేసులు రెట్టింపు అవుతాయ‌ని అక్కడున్న వైద్య సిబ్బందికి వెల్లడించారు. దేశ‌మంతా మందులు స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌న్న‌ది త‌న బాధ్య‌త అన్నారు మంత్రి. అయితే, డాక్ట‌ర్లు కూడా క్వారెంటైన్ అయితే, మందులు స‌ర‌ఫ‌రా చేసేవాళ్లే క్వారెంటైన్ అయితే, క‌రోనా వైర‌స్‌ను ఎవ‌రు ఎదుర్కొంటార‌ని మంత్రి ప్రశ్నించారు. దేశీయ విమానాల్లో క‌ర్నాట‌క వ‌స్తున్న‌వారికి ఏడు రోజులు హోట‌ల్ క్వారెంటైన్ త‌ప్ప‌నిస‌రి చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఆ త‌ర్వాత ఏడు రోజుల ఇంట్లో క్వారెంటైన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. కానీ, ఈ నియ‌మం నుంచి కొంద‌రికి మిన‌హాయింపులు ఉన్నాయంటున్నారు అధికారులు.

Follow Us
సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే?
సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే?
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!