AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unemployment : నిరుద్యోగ రేటు ఏప్రిల్ లో పెరిగింది.. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందంటే.. పట్టణాల కంటే గ్రామాలే బెటర్!

భారత్‌లో నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 7.83 శాతానికి పెరిగింది. ఇది మార్చి నెలలో 7.60 శాతంగా ఉండగా, గత నెల 7.83 శాతం పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నివేదిక వెల్లడించింది.

Unemployment : నిరుద్యోగ రేటు ఏప్రిల్ లో పెరిగింది.. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందంటే.. పట్టణాల కంటే గ్రామాలే బెటర్!
employees
KVD Varma
|

Updated on: May 04, 2022 | 12:16 PM

Share

Unemployment : భారత్‌లో నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 7.83 శాతానికి పెరిగింది. ఇది మార్చి నెలలో 7.60 శాతంగా ఉండగా, గత నెల 7.83 శాతం పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం పట్టణ నిరుద్యోగిత రేటు 9.22 శాతానికి పెరిగింది. మార్చి నెలలో ఇది 8.28 శాతంగా మాత్రమే ఉంది. ఇక గ్రామీణ నిరుద్యోగిత రేటు మాత్రం మార్చిలో 7.29 శాతం నుండి ఏప్రిల్ నెలలో 7.18 శాతానికి తగ్గింది. నిరుద్యోగిత రేటు అత్యధికంగా నార్త్-ఈస్ట్ రాష్ట్రాల్లో ఉంది. హర్యనాలో 34.5 శాతం, రాజస్థాన్‌లో 28.8 శాతం, బీహార్‌లో 21.1 శాతంగా ఉంది. తక్కువ నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, 0.2 శాతం, చత్తీస్‌గఢ్ 0.6 శాతం, అసోం 1.2 శాతంగా నమోదయింది.

నిరుద్యోగం అందుకే పెరిగింది

దేశీయంగా డిమాండ్ బాగా తగ్గడం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఆర్థిక రికవరీ మరింతగా నెమ్మదించడం వంటి అంశాలు ఉద్యోగ అవకాశాలు దెబ్బతినడానికి కారణంగా మారాయి. రిటైల్ ద్రవ్యోల్భణం మార్చి నెలలో 17 నెలల గరిష్టస్థాయి 6.95 శాతానికి పెరిగి, ఈ ఏడాది చివరలో 7.5 గరిష్టస్థాయికి చేరుకునే అవకాశముందని ఆర్థిక నిపుణుల అంచనాగా ఉంది. జూన్‌లో సెంట్రల్ బ్యాంకు రెపో రేటును పెంచవచ్చునని భావిస్తున్నారు. సీఎంఐఈ గణాంకాలను ఆర్థిక నిపుణులు నిశితంగా పరిశీలిస్తారు. మందగమనంతో కరోనా సమయంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మార్చి 2019లో 43.7 శాతం నుంచి 2022 మార్చి నాటికి 39.5 శాతానికి పడిపోయింది.

ఆర్థిక మందగమనం వల్ల ఏప్రిల్ నెలలో నిరుద్యోగం పెరిగిందని సీఎంఐఈ పేర్కొంది. దేశీయంగా డిమాండ్ మందగించడం, పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దేశంలో నెలకొన్న ఉద్యోగాల కల్పన లేమి సమస్య కారణంతో పాటు తమకు తగిన ఉద్యోగాలు లభించకపోవడంతో కోట్లాదిమంది ఉద్యోగాల వేట ఆపేశారని, కార్మిక శక్తి నుండి వైదొలుగుతున్నారని సీఎంఐఈ గత నెలలో పేర్కొంది. మార్చి నెలలో లేబర్ ఫోర్స్ 38 లక్షలు తగ్గినట్లు తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో సరిపడా ఉద్యోగాలను సృష్టించేందుకు వృద్ధి రేటు 6 శాతం నుంచి 8 శాతం మధ్య ఉంటే సరిపోదని, అంతకుమించి ఉండాల్సిన అవసరముందని CMIE అభిప్రాయపడింది. మరోవైపు మార్చిలో సీపీఐ ద్రవ్యోల్బణం 6.95%తో 17 నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 7.5%కు చేరుకోవచ్చునని అంచనాలు ఉన్నాయి. హోల్ సేల్ ద్రవ్యోల్భణ సూచీ WPI 4 నెలల గరిష్ఠం 14.55%కి చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

CIA CTO: అమెరికా గూఢచార సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి.. చరిత్రలో తొలిసారిగా..

Tata Motors: ఏప్రిల్ లో సూపర్ సేల్స్ నమోదు చేసిన టాటా మోటార్స్.. ప్రత్యర్థి కంపెనీలు డీలా..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి