ఫైజర్ వ్యాక్సిన్ కి అంత ‘సీన్’ లేదా ? ఎలర్జీ వార్నింగ్ జారీ చేసిన బ్రిటన్ ప్రభుత్వం, అప్పుడే ‘నీలినీడలు’!

కరోనా వైరస్ పై పోరుకు ఫైజర్, బయో ఎన్ టెక్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ పై అనుమానపు నీలినీడలు పరచుకుంటున్నాయి. సందేహాలు తలెత్తుతున్నాయి. ఓ మందు లేదా ఆహారమైనా శరీరానికి..

ఫైజర్ వ్యాక్సిన్ కి అంత 'సీన్' లేదా ? ఎలర్జీ వార్నింగ్ జారీ చేసిన బ్రిటన్ ప్రభుత్వం, అప్పుడే 'నీలినీడలు'!
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 10, 2020 | 6:04 PM

కరోనా వైరస్ పై పోరుకు ఫైజర్, బయో ఎన్ టెక్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ పై అనుమానపు నీలినీడలు పరచుకుంటున్నాయి. సందేహాలు తలెత్తుతున్నాయి. ఓ మందు లేదా ఆహారమైనా శరీరానికి పడకుండా ఎలర్జీ ఉన్నవారు ఈ టీకామందు తీసుకోరాదని బ్రిటన్ లోని రెగ్యులేటరీ ఏజెన్సీ ..’ఎలర్జీ వార్నింగ్ ‘ జారీ చేసింది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటినుంచీ మొత్తం మూడు ఎలర్జీ రియాక్షన్ కేసులు నమోదయ్యాయని మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజన్సీ తెలిపింది. ఎలాంటి వ్యాక్సిన్ తో గానీ, ఆహారంతో గానీ ఎలర్జీ సోకినవారెవరైనా సరే దీన్ని తీసుకోరాదని ఈ ఏజన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైనే సూచించారు. ఈ టీకామందుపై తమ రెగ్యులేటరీ సంస్థ ప్రకటించిన సేఫ్టీ, నాణ్యత తదితరాలపై నమ్మకం ఉన్నవారే తీసుకోవాలన్నారు. ‘అనాఫిలాక్సిన్’ అనే ఎలర్జీ ఒక్కోసారి ప్రాణాంతకమవుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

కాగా రెగ్యులేటరీ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఇన్వెస్టిగేషన్ ను తాము స్వాగతిస్తున్నామని  ఫైజర్ సంస్థ తెలిపింది. తమ క్లినికల్ ట్రయల్స్ లో ఎలర్జీ ఉన్న వలంటీర్లను తాము పక్కన పెట్టామని ఈ సంస్థతో బాటు బయో ఎన్ టెక్ కూడా వెల్లడించింది. అయితే ఎలర్జీ ఉన్న ప్రతివారికీ ఈ వ్యాక్సిన్ హానికరం కాదని ఓ నిపుణుడు తెలిపారు. కొన్ని తీవ్రమైన ఎలర్జీ కేసులకే ఈ టీకామందు కొంతవరకు చేటు తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.