ఫైజర్, బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ కి బ్రిటన్ ఆమోదం, యూరపియన్ మెడిసిన్స్ ఏజన్సీ దే ఇక నిర్ణయం !
ఫైజర్, బయోటెక్ కోవిడ్ 19 వ్యాక్సిన్ ని బ్రిటన్ ఆమోదించింది. ప్రపంచంలో ఓ వ్యాక్సిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తొలి దేశమైంది. వచ్ఛే వారం నుంచి ఈ టీకామందు విస్తృత వినియోగం మొదలవుతుందని బ్రిటన్ ప్రకటించగా..

ఫైజర్, బయోటెక్ కోవిడ్ 19 వ్యాక్సిన్ ని బ్రిటన్ ఆమోదించింది. ప్రపంచంలో ఓ వ్యాక్సిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తొలి దేశమైంది. వచ్ఛే వారం నుంచి ఈ టీకామందు విస్తృత వినియోగం మొదలవుతుందని బ్రిటన్ ప్రకటించగా..ఇందుకు రెగ్యులేటరీ ఏజెన్సీ (మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ ఏజెన్సీ) చేసిన సిఫారసును ప్రభుత్వం ఆమోదించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. త్వరలో ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. కాగా ఫైజర్, బయోటెక్, యుఎస్ సంస్థ మోడెర్నా.. తమ వ్యాక్సిన్లు 90 శాతం నాణ్యమైనవని తమ ప్రాథమిక పరిశోధనల్లో తేలినట్టు వెల్లడించాయి. వీటి అత్యవసర ఆమోదం కోసం యూరోపియన్ యూనియన్ కు దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ అప్లికేషన్లు తమకు అందాయని, త్వరలో వీటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ వెల్లడించింది.కాగా- కరోనా వైరస్ పై పోరులో బ్రిటన్ తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రధానమైనదని ఫైజర్ సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు తగిన వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వేళ ఈ దేశం ఇలా చొరవ చూపడం ముదావహమని ఈ కంపెనీ వ్యాఖ్యానించింది.