ఇంజనీర్లకు గుడ్ న్యూస్: ఉబెర్‌లో నూతన నియామకాలు!

ఇంజనీర్లకు గుడ్ న్యూస్: ఉబెర్‌లో నూతన నియామకాలు!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తొలగించాయి. ఈ క్రమంలో క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ శుభవార్త అందించింది. 140 మంది కొత్త ఇంజనీర్లను నియమించుకోనున్నామని

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 06, 2020 | 12:10 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తొలగించాయి. ఈ క్రమంలో క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ శుభవార్త అందించింది. 140 మంది కొత్త ఇంజనీర్లను నియమించుకోనున్నామని ప్రకటించింది. డెలివరీ, మార్కెట్ ప్లేస్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్ కంప్లైయెన్స్, సేఫ్టీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాలలో ఈ నియామకాలుంటాయని ఉబెర్ వెల్లడించింది.

తాజాగా లేఆఫ్ ప్రకటించిన ఉబెర్ ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఇంజనీర్ల నియామకాలవైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 140 మంది ఇంజనీర్లను ఎంపిక చేస్తామని ఉబెర్ సీనియర్ డైరెక్టర్ గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్ జయరామ్ వల్లియూర్ తెలిపారు. కరోనా సమయంలో భౌతిక దూరాన్ని ప్రోత్సహించేలా డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడం, మార్కెట్‌లోకి ఆన్‌బోర్డ్ రెస్టారెంట్ మెనూలకు సంబంధించి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల అభివృద్దికి పెట్టుబడులు పెడుతున్నామని ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహి ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజా నియామకాలు జరగనున్నాయి.

Read More:

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu